Showing posts with label S. Show all posts
Showing posts with label S. Show all posts
Friday, August 30, 2013
Sekhar Kapoor

- నిన్న మొన్నటివరకు గడాఫీని పొగిడిన వివిధ దేశాధినేతలు ఇప్పుడు అతని చావును స్వాగతిస్తున్నారు. గడాఫీని క్రూర నియంతగా పోలుస్తున్న ఐరోపా దేశాధినేతలు దశాబ్దాలుగా ఎక్కడున్నారు? చమురు రాజకీయాల్లో నైతిక విలువలుకు స్థానమెక్కడ?
- ఒక వ్యక్తి పదవిలో ఎక్కువ కాలం ఉంటే, ‘నాకు పరిపాలించే హక్కు ఉంది’ అని తనకు తనే అనుకోవడం మొదలుపెడతాడు. అది మానవ స్వభావం!
- మనం గాంధీజీని మహాత్ముడంటూ పూజిస్తాం. కాని ఆయన చెప్పిన మంచిని మన జీవితాల నుంచి వేరు చేస్తున్నాం. మనం ఆయనను నిలుపుకోవాల్సింది మన మనసుల్లో... గోడకున్న పటాల్లో కాదు!
- మన దేశంలో మేధావులు అనుకుంటున్న కొందరు మాట్లాడుతున్న మాటలు కేవలం మాటలు మాత్రమే. వాటి కంటే ఆకలేసినప్పుడు ఓ జంతువు అరిచే అరుపులకు ఎక్కువ అర్థం ఉంటుంది!
- ఏ కళ అయినా సమాజం యొక్క మనస్సాక్షిని ప్రతిబింబించాలి. సినిమా కూడా ఒక కళే. మరి నేటి సినిమాలు ఆ పని చేస్తున్నాయా?
Sunday, November 25, 2012
Sruthi Hasan
- ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే... అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేం.
- ప్రతి ఒక్కరూ ఎదుటివారిని తప్పుబడుతూ ఉంటారు. అలా చేయటం మంచిది కాదు. గాజు భవంతిలో నివసించేవాడు ఎదుటివాడి మీద రాళ్లు వేయడం ఎంత తప్పో వాళ్లంతా తెలుసుకుంటే మంచిది.
- నేను మొన్నొక దృశ్యం చూశాను. బస్టాప్‌లో బస్సు వచ్చి ఆగగానే అందరూ తోసుకుంటూ ఎక్కేస్తున్నారు తప్ప, పక్కన వీల్‌చెయిర్‌లో ఉన్న వ్యక్తిని ఎక్కించడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు. తామే మొదట ఎక్కాలని అందరికీ తాపత్రయం. ఇంకెక్కడుంది మానవత్వం!
- అవతలివారు నీ గురించి ఏమనుకుంటున్నారో అని మాత్రమే ఆలోచిస్తూ కూర్చుంటే, నీ గురించి నువ్వు ఆలోచించుకోవడమే మర్చిపోతావ్. ఇది నీ జీవితం. నీకు నచ్చినట్టు జీవించు. జీవితం ఉన్నది జీవించడానికే కదా!
- కొన్నిసార్లు కొన్నిటిని వదిలిపెట్టడం కష్టమనిపిస్తుంది. కానీ వాటిని ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకోవాలని చూడటం వల్ల... నువ్వు జీవితంలో ఇంకేమీ చేయడానికి వీల్లేకుండా అవి నీ చేతుల్ని కట్టిపారేస్తాయి. కాబట్టి కాస్త బాధగా ఉన్నా, కొన్నిటిని వదులుకోవడమే మంచిది!
-సేకరణ: అనూష (సాక్షి)
Friday, October 12, 2012
Susmitha Sen
- మీరు ఎవరి నుంచి ఏమీ ఆశించకండి. నిజాయితీగా వ్యవహరించండి. మీరు అలా ఉండగలిగితే, మిమ్మల్ని చూసి మిగిలినవాళ్లు కూడా అలాగే ప్రవర్తిస్తారు!
- నువ్వు అందరితో మంచిగా ఉంటావు కాబట్టి అందరూ నీతో మంచిగా ఉండాలని కోరుకోవడం అమాయకత్వమే అవుతుంది. అలా కోరడం ఎలా ఉంటుందంటే... నేను నిన్ను తినను కాబట్టి నువ్వు కూడా నన్ను తినకు అని సింహాన్ని అడిగిన ట్టుంటుంది!
- మనం ఏ విషయంలోనైనా ఫెయిలయ్యాము అని అన్నామంటే, మనం దాన్ని సాధించడానికి అస్సలు ప్రయత్నించనట్టు లెక్క. ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ ఉండదు!
- భారతీయు రాలినైనందుకు నేనెప్పుడూ గర్వపడు తుంటాను. ఇంత గొప్ప దేశానికి మొట్టమొదటి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తెచ్చినందుకు ఇంకా గర్వపడతాను!
- స్వచ్ఛమైన, పారదర్శకమైన సామాజిక, రాజకీయ వ్యవస్థ పౌరుల హక్కులను కాపాడగలుగుతుంది. అవినీతి మాత్రం వాటికి భంగం కలిగిస్తుంది. అందుకే లోక్‌పాల్ బిల్లు పాస్ అయ్యి తీరాలి!
- దేనినైనా మన బలంతో సాధించాలి కానీ అవతలివారి బలహీనతతో కాదు. ఎందుకంటే, నిజమైన గెలుపు మన కృషి వల్లే లభిస్తుంది తప్ప, అవతలి వారు ఓడిపోవడం వల్ల కాదు!
- స్త్రీకి పురావస్తు శాస్త్రవేత్తకంటే ఉత్తమమైన భర్త ఎవరూ ఉండరు. ఎందుకంటే అతడికి మాత్రమే పాతబడేకొద్దీ భార్య మీద ప్రేమ పెరుగుతుంది!
- దేనినైనా దీర్ఘకాలం పాటు నిర్లక్ష్యం చేస్తే, సమస్య మరింత తీవ్రతరమవుతుంది. నిద్రపోతున్న సమాజాన్ని లేపడానికి ఎవరో ఒక సమర్థుడు నడుం కట్టాలి!
Thursday, September 13, 2012
Friday, July 27, 2012
Monday, July 02, 2012
Si Sri Ravisankar
- ఎటువంటి కల్మషం అంటని మనసుతో, అత్యంత గొప్ప వ్యక్తిత్వంతో మనిషి భువిపై అడుగుపెడతాడు. అంత స్వచ్ఛమైన వ్యక్తిత్వం పతనం దిశగా దారితీస్తే... దాన్ని తిరిగి సంపాదించుకోవడం అసాధ్యం!
- కొత్త రకం మొబైల్ వాడటం నేర్చుకొన్నట్టే, మనసును ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నేర్చుకోవాలి. మీ దైనందిన జీవితంలో మెడిటేషన్‌కు కొంత సమయాన్ని కేటాయిస్తే, శరీరానికి కావలసినంత శక్తిని ఇచ్చినట్టే!
- మనిషిలోని దురాశ, భయాలను పొగొట్టి, ఎటువంటి ఒత్తిడి లేని జీవితాన్ని, అశాంతి, హింసలు లేని సమాజాన్ని తీసుకురాగల ఫార్ములా నా దగ్గర ఉంది.
- విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అనుకూల స్థితిలో ఉన్న శరీరం... జాలి, దయ ఉన్న కారుణ్య హృదయం... అస్పష్టత లేని మెదడు... బాధలేని ఆత్మ... ఇవి మనిషి ఆరోగ్యంగా ఉన్నాడనడానికి రుజువులు!
- దేశంలో అవినీతిపై పోరాటం మొదలై నప్పుడు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ను కూడా అంతం చేయాలని కొంతమంది ప్రయత్నించారు. మేం వాస్తవాన్ని మాట్లాడటానికి ఎప్పుడూ వెనకడుగు వేయం. అది ఎవరికి రుచించకపోయినా ఇలాగే కొనసాగుతాం.
- అయామ్ నథింగ్, ఐ వాంట్ నథింగ్, అయామ్ డూయింగ్ నథింగ్... మెడిటేషన్‌కు సంబంధించి బంగారం లాంటి సూత్రాలివి.
- విద్య మనిషికి ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. మనం సమాజం నుంచి ఏం స్వీకరించామో, అది తిరిగి చెల్లించడమే విద్య అంతరార్థం.
Thursday, June 28, 2012
Surya (Actor)
- జీవితం చాలా విలువైనది. మన నమ్మకం ఆ విలువను పెంచుతుంది.
- జీవితంలో మనం వేసే ప్రతి అడుగూ ఓ కొత్త అధ్యాయం. అది ఓ సరికొత్త ప్రయాణం కోసం ఎదురుచూస్తుంటుంది.
- అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అదృష్టం కలిసొస్తుంది.
- ప్రతి స్నేహితుడూ మనలో మనకే తెలియని కొత్త ప్రపంచాన్ని చూపిస్తాడు. అతడు కలిసే వరకు అది మనకు తెలియదు.
- వాస్తవికమైన కలలను నటనలో ప్రతిబింబించే వాడే నిజమైన కళాకారుడు.
- ప్రపంచంలోని వేల భాషలకు దీటైనది చిరునవ్వే. ఎందుకంటే అది పసికందు కూడా మాట్లాడగలిగిన భాష.
- సాటి మనుషులపై నీకు గౌరవం ఉంటే, వారి జీవితం మెరుగుపడటానికి కచ్చితంగా నీవు సాయపడగలవు.
- ఆరోగ్యమనేది గొప్ప బహుమతి. సంతృప్తి అనేది గొప్ప సంపద. నమ్మకం ఓ గొప్ప బంధం.
మన ఊహా శక్తి అసలు ఉనికే లేని ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఊహ లేనిదే మనకు గమ్యమే లేదు. - కలలనేవి... రేపటి ప్రశ్నలకు నేటి సమాధానాలు.
- ఇప్పటికే ప్రారంభించిన పనికి మరో ఆరంభం ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే, సరికొత్త ముగింపు ఇవ్వడానికి మాత్రం వర్తమానం అవకాశం కల్పిస్తుంది.
సేకరణ: అనూష(సాక్షి పత్రిక)
Wednesday, June 20, 2012
Thursday, May 17, 2012
Wednesday, November 02, 2011
Sathya Sai
- ఈ రోజును ప్రేమతో మొదలుపెట్టు,ఇతరుల కోసం ప్రేమతో సమయం వెచ్చించు,రోజంతా నీలో ప్రేమను నింపుకో,ప్రేమతోనే ఈ రోజును ముగించు,దేవుని గుర్తించడానికి అదే సరైన దారి.
- కోరికలు ప్రయాణంలో తీసుకువెళ్లే వస్తువ్వులాంటివి..ఎక్కువైతే జీవిత పయనం కష్టమౌతుంది.
- క్రమశిక్షణ సరిగా ఉంటే ఇంకొకరి రక్షణ అవసరం లేదు.
- అన్నం పెట్టేవాళ్లు,అమృతం పెట్టేవాళ్లేకాదు విషం పెట్టేవాళ్లు కూడా నావాళ్లే.
- మనిషి తనలోని ఈర్ష్య,అసూయ,ద్వేషాలను,కోరికలను,ప్రాపంచిక సుఖ భోగాలను త్యజిస్తూ పోతే అదే నిజమైన భగవత్ పూజ.
Wednesday, October 26, 2011
Sachin Ramesh Tendulkar
- మంచి స్నేహితులంటే ఆకాశంలోని నక్షత్రలాంటివాళ్లు... కొన్నిసార్లు కళ్లకు కనబడకపోయినా అవసరమైన సందర్భాల్లో మనకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు.
- ఎప్పుడు క్రికెట్ ఆడినా నా దృష్టిలో నేనెప్పుడు ఆ ఆటను తక్కువగానో లేక చాలా ముఖ్యమైనదిగానో భావించనేలేదు.
- యావత్ దేశము నా కోసం ఎదురు చూస్తుంది,వాళ్ల ఎదురుచూపులే నేను మరింత కష్టపడి ఆడేలా చేస్తుంది.
- ఎవడైతే ఒకడు క్రికెటును ఎక్కువ కాలం ఆడుతాడో,అతడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతాడు.
- ప్రజలు ముందు క్రికెట్ అనేది సమిష్టి జట్టుగా ఆడే ఆటా లేక వ్యక్తిగత ఆటా అని నిర్ణయించుకోవాలని నేను తలుస్తాను.
- నాకెప్పుడు భారతదేశం తరపున ఆడాలనే కల ఉండేది, కాని అందుకు నేనెప్పుడు నాలో ఒత్తిడిని అనుమతించలేదు.
- ఓడిపోవడాన్ని నేను ద్వేషిస్తాను, క్రికెటే నా తొలి ప్రేయసి. ఒక్కసారి నేను మైదానంలోకి అడుగు పెట్టితే అది ప్రత్యేక పరిధి, అక్కడ ఎల్లప్పుడూ గెలుపు కోసమే ఆత్రుత.
- నేను తిరిగివెళ్ళిన దారినే సరిగ్గా కొనసాగించాలని కోరుకుంటున్నాను.
- నేను నా ఆరు గంటల నిష్కపటమైన క్రికెటును మైదానంలో అందించాలని కోరుకుంటున్నాను, దాని తర్వాత ఫలితం ఏదైతేనేం.
- నా జీవిత కాలంలో నేనెప్పుడు ఒక పరుగిడువానితో(runner) ఆడిందే లేదు, పాఠశాలలో సైతం, ఎందుకంటే కేవలం నాకు మాత్రమే తెలుసు, బంతి ఎటువైపు వెళ్ళేది, ఎప్పుడు ఆ బంతిని బలంగా కొట్టాను అని. నాకు పరుగిడువానికి(runner) దాని గురించి ఎప్పుడును తెలియదు కదా.
- నేనెప్పుడు నన్ను ఇతరులతో పోల్చుకోవడానికి ప్రయత్నించ లేదు.
- నేనెప్పుడు ఆలోచించనేలేదు నేను ఎక్కడికి వెళతానో లేక ఏ లక్ష్యమైనా నన్ను బలవంత పెడుతుందో అని.
- నా కొడుకు అర్జున్ ను క్రికేటరే కావాలని ఒత్తిడి చేయను. అతని కెరీర్ అతనిష్టం.
- హర్భజన్ స్వతహాగా దూకుడు స్వభావం కలిగిన క్రికెటర్. టెన్నిస్ లో మేకన్రోలాగా క్రికెట్ లోను కొందరు దూకుడు ఆటగాళ్లుంటారు.
- నువ్వు జీవితంలో ఏ స్థాయిలో టేకాఫ్ తీసుకుంటావు అనే దాని మీదే నువ్వు జీవితంలో చేరుకొనే స్థాయి ఆధారపడి ఉంటుంది.
- వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టును చూసి భారతీయులంతా గర్వించటమే కాదు. అదే స్ఫూర్తితో తమ స్వప్నాలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.
- ఎంతోమంది నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానమిదే.....'నేను ఏ సినిమాలోనూ నటించటం లేదు.'
- ఫెధరర్ కు క్రికెట్ గురించి కూడా బాగా తెలుసు.
- నువ్వు జీవితాన్ని ఏ స్థాయిలో టేకాఫ్ తీసుకొంటావు అనే దాని మీదే నువ్వు జీవితంలో చేరుకొనే స్థాయి ఆధారపడి ఉంటుంది.
Sunday, September 25, 2011
Sourav Ganguly(Cricketer)
- రిటైర్మెంటు గురించి ఆలోచించినప్పుడు సచిన్, ద్రవిడ్,లక్ష్మణ్ లు తమకు తాముగా నిర్ణయం తీసుకోవాలి.ఏ రోజైతే వాళ్ల ప్రదర్శన తగ్గిందనుకుంటే అప్పుడే ఆట నుంచి వైదొలగాలి.. ద్రవిడ్,లక్ష్మణ్ ఇప్పటికే వన్ డే ల నుంచి తప్పుకున్నారు. సచిన్ కూడా చాలా తక్కువ ఆడుతున్నాడు. కాబట్టి వన్ డేలలో యువకులు రాణించేందుకు ఇది మంచి అవకాశం. కానీ టెస్ట్ లే ఎక్కువ కలవర పెడుతున్నాయి. ఈ సీనియర్లను మించిన ఆటగాళ్లు ఇప్పటివరకూ రాలేదు.
Monday, September 12, 2011
Siddharth(Actor)
- ఏంటి పరిస్థితి ఇలా తయారైంది. భారతజట్టు ఆడుతున్న క్రికెట్ ఆట ఎప్పుడూ ఇంత నిరాశాజనకంగా లేదు.
- మన రాజకీయ నాయకులు ఆస్తులు ప్రకటించారు. వారి ఆస్తులు మరీ లక్షల్లోనే ఉన్నాయి. మనమే వాళ్లను ఆర్థికంగా ఆదుకోవాలి.
- విజయం కోసం పయనంలో పరాజయం ఒక మైలురాయి లాంటిది. ఫెయిల్యూర్స్ గురించి ఆలోచిస్తుంటే విజయానికి దగ్గర కాలేం.
Sunday, August 21, 2011
Sunday, August 14, 2011
Subscribe to:
Posts (Atom)







