- ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు, పేదింట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు ఉన్నత చదువులు చదవాలి.
- అన్నం పెట్టె రైతన్నను రుణ విముక్తున్ని చేయడమే నా లక్ష్యం.
- నేను కలలుగన్న మరో ప్రపంచానికి మహిళలే మూలస్తంభాలు.
- రాష్ట్ర ప్రజలకు జీవితాంతం సేవ చేయడమే భాగ్యం.
- ఆర్ధిక అసమానతలు తొలగకపోతే రాజకీయ స్వాతంత్ర్యానికి అర్ధం లేదు
- ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగు పడాలి. అందుకు అధికారులు నిబద్ధత,పారదర్శకత,కార్యదీక్షతో పనిచేయాలి.
- ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా మారుమూల పల్లెలకు వెళ్ళాలి.
- ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.
- పేద ప్రజల ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. రాజీవ్ ఆరోగ్య శ్రీ సంజీవనిలా పనిచేస్తుంది, ఈ తృప్తి చాలు.
- బీడు తెలంగాణ భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరులు పండాలి.
- రిలయన్స్ గ్యాస్ అందుబాటులోకి వస్తే మూడో పంటకు కూడా విద్యుత్ సరఫరా చేస్తాం. అప్పుడిక ప్రతి రైతు ఇంట సంక్రాంతే.
- మహిళల ముఖాలు కలకలలాడుతూ ఉంటేనే కుటుంబమూ,సమాజమూ బాగుంటాయి.
- నా అక్కలూ,చెల్లెళ్ళు..తముళ్ళ కళ్ళలో వెలుగులు చూసినపుడే నా నిజమైన పుట్టినరోజు.
- ప్రతిరైతు పట్టణ ప్రాంత వ్యక్తితో సమానంగా ఆదాయం పొందాలన్నదే నా అభిమతం.
- ప్రాజక్టులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలు ఎవరినీ క్షమించవు.
- పారిశ్రామిక రంగానికి దీటుగా సేద్య రంగం ఎదగాలి. వ్యవసాయ ఫలాలు పదింతలు పెరగాలి.
- అవినీతి,అసత్య వార్తలు క్యాన్సర్ కన్నా ప్రమాదకరం.
- జల ప్రాజక్టులపై జనం ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ నమ్మకం వమ్ము కాకూండా పనిచేయాలి.
- గ్రామాల్లో సంపద పెరగాలి పెరిగిన సంపద గ్రామీణ ప్రజలకే చెందాలి.
- ప్రజల ఋణం తీర్చుకునేందుకు ఎంతటి కృషికైనా సిద్ధంగా ఉండాలి.
- జాతికి జల సౌభాగ్యం కల్పించిన రోజే నాకు అసలైన పండుగ రోజు.
- ప్రాజక్టులు పూర్తి చేసి శాశ్వత వనరుల ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ నిర్మించాలి.
- పారిశ్రామిక రంగానికి దీటుగా సేద్యరంగం ఎదగాలి. వ్యవసాయ ఫలాలు పదింతలు పెరగాలి.
- గ్రామం ప్రగతి పథంలో ఉంటే ఎవ్వరూ ముఠా కక్షల జోలికి వెళ్లరు.
- ఎన్ని కరువులనైనా ఎదుర్కోగలగాలి, దీని కోసం ఆర్ధికంగా ఎదగాలి.
- ఆంద్రప్రదేశ్ ను దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్దాలనేది నా స్వప్నం.
- స్వఛ్ఛమైన రక్షిత జలాలను అందిస్తేనే గోండు,చెంచు,ఆదివాసి గిరిజనులు ఆరోగ్యంగా ఉంటారు.
- ప్రజల ఋణం తీర్చుకొనేందుకు ఎంత కృషి చేయడానికైనా నేను సిద్ధం.
- ప్రతి రైతు వాణిజ్యవేత్తగా మారాలి.
- నిరుపేదలకు పట్టెడన్నం దొరికేటట్లు చేయడం ప్రభుత్వ ధర్మం.అందుకు ఎన్ని కోట్లు ఖర్చయినా వెనుకాడకూడదు.
- అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమము అంతే ముఖ్యం.
Showing posts with label Y. Show all posts
Showing posts with label Y. Show all posts
Tuesday, May 17, 2016
YS Rajasekhara Reddy
Monday, December 03, 2012
Thursday, August 04, 2011
Yaddanapudi Sulochana Rani
- మనసులో అనుక్షణం డబ్బు గురించి బెంగ పెట్టుకునే మనుష్యులు జీవితంలో సాహసించి ఏ సుఖము పొందలేరు.
- ఆడపిల్లలకి డిగ్రీలు,హోదాలు కాకుండా మంచి చెడులు గ్రహించ గలిగిన విచక్షణ, తనకి అన్యాయం జరగకుండా చూసుకునే తెలివితేటలు కుడా చాలా ముఖ్యం.
- అభిమానమే ప్రాణంగా భావించుకొనే వ్యక్తులకి అది చంపుకొని తిరగటం కంటే ఘోరమైన చిత్రవధ ఏదీలేదు.
- ఈ ప్రపచంలో దేనికి లేని శక్తి మనిషి మాటకుంది.
- ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ గుండెల మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా నాకెలాంటి బాధ లేదు, నేను నిశ్చింతగా ఉన్నాను అని చెప్పలేరు.
- డబ్బు లేకపోతే లేదనేది ఒక్కటే బాధ, డబ్బుంటే దానితో వచ్చే బాధలు అనేకం.
- ఒక్కోసారి కొంతమంది చూడగల శక్తి ఉండి కూడా గుడ్డివాళ్ళు అవుతారు.
Friday, July 29, 2011
Yandamoori Veerendranath
- సంతృఫ్తి కోసం బ్రతకవద్దు. సంతృప్తితో బ్రతకాలి.
- ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు. నువ్వులేనప్పుడు నవ్వుని,నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం.
- పెళ్లయిన తర్వాత జీవిత భాగస్వామిని ప్రేమించటం అన్నిటికన్నా ఆరోగ్యకరమైన ప్రేమ.
- ఎక్కడయితే శత్రుత్వం వుంటుందో అక్కడ ప్రతి మనిషి తనకంటూ ఒక రీజన్ ఏర్పరచుకొని వాదించటం ప్రారంభిస్తాడు. ఎక్కడ 'ప్రేమ' ఉంటుందో అక్కడ రీజన్ వుండదు.
- ప్రేమ ఒక లెక్క లాంటిది. సంతోషం గుణకారం,దుఖం భాగహారం,స్నేహం కూడిక,శత్రుత్వం తీసివేత.
- ఒకరి అందం,అర్హతల వాళ్ళ మొదట ఆకర్షణ ఏర్పడి, వారి ప్రవర్తనవల్ల అది స్నేహంగా మారి వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది.
- ప్రేమించటానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి.
- ప్రేమకు మొదటి స్టెప్పు ఆసక్తే.
- ప్రేమనీ,ఆకర్షణనీ ఏ పాయింటు దగ్గర విడగొట్టలన్నది ఏ ఐన్ స్టీను కనుక్కోలేదు.
- ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.
- ప్రేమ ఇంద్రధనుస్సు అయితే ఆ ఏడు రంగులూ- ఆకర్షణ,అవగాహన,ఇష్టం,తాదాత్మ్యత ,స్పర్శ,కామం,ఓదార్పు.
- ప్రేమ అన్న ఒక్క అర్హతవల్లె మనిషి మిగతా జీవాల్నుంచి విడివడ్డాడు.
- ప్రేమంటే సృతిమించినప్పుడు,శుష్కించినప్పుడు ఒకేలా వుండేది.
Subscribe to:
Posts (Atom)


