- నా అనుభవం తెలియజేసిందేమిటంటే...ఎదుటివాళ్లు మనం చెప్పిన విషయాన్ని మర్చిపోతారు.మనం వాళ్లకు చేసిన పనులను మర్చిపోతారు.కానీ మనం వారికి పంచిన అనుభూతుల్ని మాత్రం ఎప్పటికి మర్చిపోలేరు.
- ఏ పనినైన చేయడానికి మనం భయపడుతున్నామంటే..అది కష్టమైనది కావడం వల్ల కాదు.మనం భయపడుతున్నందు వల్లే అది కష్టంగా అనిపిస్తుందని తెలియకపోవడం వల్ల.
- నువ్వు కన్న కల పగిలి వంద ముక్కలై పోయిందనుకో. వాటిలోని ఒక్క ముక్కను తీసుకోవడానికి వెనుకాడవద్దు. ఎందుకంటే మరో కొత్త ఆరంభానికి అదే నీకు ఆధారం.
- ప్రతి ఒక్కరి జీవితాలలోనూ సంతోషభరిత క్షణాలుంటాయి.దుఃఖపూరిత ఘడియలు ఉంటాయి. అయితే నువ్వు వేటిని గుర్తుంచుకున్నావన్నదానిమీదే నీ సంతోషం ఆధారపడి ఉంటుంది.
- తోటలోవున్న పువ్వుల్ని బట్టి తోటను అంచనా వెయ్యాలి తప్ప..రాలిపడిన ఆకుల్ని బట్టి కాదు. మన జీవితాల్ని అంచనా వేయాల్సింది నవ్వులతో తప్ప రాల్చిన కన్నీటి చుక్కలతో కాదు.
- నీ డబ్బును బట్టో, నీ స్థాయిని బట్టో ఎప్పుడు గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు,బంటూ చేరేది ఒక పెట్టెలోకే.
- ఏ మనిషి జీవితంలోనైనా రెండు గొప్ప రోజులు ఉంటాయి. ఒకటి అతడు పుట్టినరోజు. రెండోది... అతడు ఎందుకు పుట్టాడో తెలుసుకున్న రోజు!
- అబద్ధానికి వేగమెక్కువ. నిజానికి ఓపికెక్కువ!
- నువ్వు నడుస్తున్న దారి ఎటు తీసుకెళ్తే అటు వెళ్లిపోవద్దు. నువ్వు కోరుకున్నదాన్ని సాధించడానికి అవసరమైన దారిని వెతుక్కుంటూ వెళ్లు!
- తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు!
Showing posts with label L. Show all posts
Showing posts with label L. Show all posts
Monday, June 25, 2012
Lata Mangeshkar
Thursday, May 17, 2012
Tuesday, October 18, 2011
Monday, October 17, 2011
Wednesday, June 01, 2011
Leo Tolstoy
- ప్రతి ఒక్కరు ఎదుటివాళ్ళని మార్చాలని చూస్తారు తప్ప, తమని తాము మార్చుకోవాలని అనుకోరు.
- న్యాయస్థానం ఉద్దేశ్యం చెడ్డమనిషిని అడ్డుకోవడమే.
- అధికారం పొందడానికి దాన్ని నిలబెట్టుకోవడానికి ఆ మనిషికి అధికారం మీద ప్రేముండాలి.
- జీవితపు చివరి విలువ మనల్ని మనం తెలుసుకోవడం. ధ్యానశక్తిని సంపాదించడం మీద ఆధారపడి వుంటుంది. అంతేకాని మనం జీవించి వుండటం వల్లకాదు.
- కళ ఒక విశ్వజనీనమైన భాష.
- చరిత్రకారులు చెవిటివారు. ఎవ్వరు అడగని ప్రశ్నలకు జవాబులు చెపుతారు.
- చెడును ఉపేక్షించడం అంటే మంచిని నిర్లక్ష్యం చేయడమే.
- జీవితాంతం దుఃఖం ఎన్నడు లేకపోవడం అనుమానమేలేని సత్యం.
- నిజమైన సంపూర్ణమైన దుఃఖం లేనట్లే, నిష్కల్మమైన సంపూర్ణమైన ఆనందము వుండదు.
- మనిషి గురించి నువ్వు ఆలోచించు,దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు.
- సాధారణంగా ధైర్యాన్ని గురించి మాట్లాడే వారు పిరికి వాళ్లుగాను, గౌరవాన్ని గురించి మాట్లాడే వాళ్ళు దుర్మార్గులుగాను వుంటారు.
- పొరపాట్లను గమనించు.కాని బాధపడకు,వాటిని నీ ఆస్తిగా పరిగణించు.
- అర్ధం చేసుక్కున్న ప్రతిదీ నేను ప్రేమించడం వల్లే అర్ధం చేసుకున్నాను.
- ప్రతి మనిషిని సమానంగా ప్రేమించలేము.
- ఎన్నో నమ్మకాలు ఉన్నా నాలో,నీలో ప్రతిమనిశిలో జీవం ఒక్కటే.
- జీసస్ ఎన్నడు వ్యక్తిగత పునర్జన్మను గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత ఏమిటి? అనీ చెప్పలేదు.
- ప్రేమే మంచి, కాని ప్రేమ ఒక్కటే వుండదు. దానికి స్వచ్చత కలిసి వుండాలి.
- ప్రపంచాన్ని ఎలా మార్చాలా అని అందరూ తీవ్రంగా ఆలోచించి తలలు పట్టుకోనక్కర్లేదు.ఎవరికి వారు తమని తామూ మార్చుకుంటే చాలు.
Subscribe to:
Posts (Atom)





