Tuesday, May 17, 2016

YS Rajasekhara Reddy

 1. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు, పేదింట్లో  పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు ఉన్నత చదువులు చదవాలి.
 2. అన్నం పెట్టె రైతన్నను రుణ విముక్తున్ని  చేయడమే నా లక్ష్యం.
 3. నేను కలలుగన్న మరో ప్రపంచానికి మహిళలే మూలస్తంభాలు.
 4. రాష్ట్ర ప్రజలకు జీవితాంతం సేవ చేయడమే భాగ్యం.
 5. ఆర్ధిక అసమానతలు తొలగకపోతే  రాజకీయ స్వాతంత్ర్యానికి అర్ధం లేదు  
 6. ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగు పడాలి. అందుకు అధికారులు నిబద్ధత,పారదర్శకత,కార్యదీక్షతో పనిచేయాలి.
 7. ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా మారుమూల పల్లెలకు వెళ్ళాలి.
 8. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.
 9. పేద ప్రజల ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. రాజీవ్ ఆరోగ్య శ్రీ సంజీవనిలా పనిచేస్తుంది, ఈ తృప్తి చాలు.
 10. బీడు తెలంగాణ భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరులు పండాలి.
 11. రిలయన్స్ గ్యాస్ అందుబాటులోకి వస్తే మూడో పంటకు కూడా విద్యుత్ సరఫరా చేస్తాం.  అప్పుడిక ప్రతి రైతు ఇంట సంక్రాంతే.
 12.  మహిళల ముఖాలు కలకలలాడుతూ ఉంటేనే కుటుంబమూ,సమాజమూ బాగుంటాయి.
 13. నా అక్కలూ,చెల్లెళ్ళు..తముళ్ళ కళ్ళలో వెలుగులు చూసినపుడే నా  నిజమైన పుట్టినరోజు. 
 14.  ప్రతిరైతు పట్టణ ప్రాంత వ్యక్తితో సమానంగా ఆదాయం పొందాలన్నదే నా  అభిమతం.  
 15. ప్రాజక్టులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలు ఎవరినీ క్షమించవు.
 16. పారిశ్రామిక రంగానికి దీటుగా సేద్య రంగం ఎదగాలి. వ్యవసాయ ఫలాలు పదింతలు పెరగాలి.
 17. అవినీతి,అసత్య వార్తలు క్యాన్సర్ కన్నా ప్రమాదకరం.
 18. జల ప్రాజక్టులపై  జనం  ఎన్నెన్నో   ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ నమ్మకం వమ్ము కాకూండా పనిచేయాలి.
 19. గ్రామాల్లో సంపద పెరగాలి  పెరిగిన సంపద గ్రామీణ ప్రజలకే చెందాలి.
 20. ప్రజల ఋణం తీర్చుకునేందుకు ఎంతటి కృషికైనా సిద్ధంగా ఉండాలి.
 21. జాతికి జల సౌభాగ్యం కల్పించిన రోజే నాకు అసలైన పండుగ రోజు. 
 22. ప్రాజక్టులు  పూర్తి చేసి శాశ్వత వనరుల ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్  నిర్మించాలి.  
 23. పారిశ్రామిక రంగానికి దీటుగా సేద్యరంగం ఎదగాలి. వ్యవసాయ  ఫలాలు పదింతలు పెరగాలి. 
 24. గ్రామం ప్రగతి పథంలో ఉంటే ఎవ్వరూ ముఠా  కక్షల జోలికి వెళ్లరు. 
 25. ఎన్ని కరువులనైనా ఎదుర్కోగలగాలి, దీని కోసం ఆర్ధికంగా ఎదగాలి. 
 26.  ఆంద్రప్రదేశ్ ను దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్దాలనేది నా స్వప్నం.      
 27. స్వఛ్ఛమైన రక్షిత జలాలను అందిస్తేనే గోండు,చెంచు,ఆదివాసి గిరిజనులు ఆరోగ్యంగా ఉంటారు.
 28. ప్రజల ఋణం తీర్చుకొనేందుకు ఎంత కృషి చేయడానికైనా నేను సిద్ధం.
 29. ప్రతి రైతు వాణిజ్యవేత్తగా మారాలి.
 30. నిరుపేదలకు పట్టెడన్నం దొరికేటట్లు చేయడం ప్రభుత్వ ధర్మం.అందుకు ఎన్ని కోట్లు ఖర్చయినా వెనుకాడకూడదు.
 31. అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమము అంతే ముఖ్యం. 


Friday, August 30, 2013

Marilyn Monroe

 1. ఒక నటి యంత్రం కాదు, కాని వారు నిన్ను ఒక యంత్రంగా భావిస్తున్నారు. ఒక డబ్బు యంత్రంగా
 2. నేను మంచిదాన్ని కాని దేవతను కాను, నేను పాపం చేశాను కాని దయ్యాన్ని కాను,నేను ఆకర్షణీయముగా ఉంటాను,కాని అందమైనదాన్ని కాను,  నేను స్నేహితులను కలిగి యున్నాను, కాని నేనేమీ శాంతిని కలిగించుదానిని కాను, ఒక పెద్ద ప్రపంచంలో ప్రేమించేందుకు ఎవరినైనా కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న ఒక చిన్న అమ్మాయిని.   
 3. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను నేను పునరిద్ధరించుకుంటాను.    
 4. శరీరమున్నది చూసేందుకే, అన్ని మూసి ఉంచేందుకు కాదు.   
 5. మనుషులు తప్ప ,కుక్కలు నన్ను ఎప్పుడు కరువలేదు.

Arbaaz Khan

 1. మన పొరుగు దేశాల వారితో మనం కలిసిమెలిసి ఉండాలి. ఎలాంటి గొడవలూ లేకుండా ప్రశాంతంగా స్నేహాన్ని సాగించాలి. ఏ దేశానికైనా అదే నిజమైన అభివృద్ధి!
 2. చాలామంది గొప్పవాళ్లను వాళ్లు వృద్ధాప్యంలోకి అడుగిడాకో, చని పోయాకో మనం గుర్తిస్తూ ఉంటాం. కానీ అదృష్టంకొద్దీ రెహమాన్‌ని త్వరగానే గుర్తించాం. తన సంగీతంతో భారతదేశానికి ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు రెహమాన్. అతడు భారతీయుడు కావడం మనకు గర్వకారణం!
 3. నువ్వు గెలిస్తే కొందరు సంతోషిస్తారు. నువ్వు ఓడిపోతే కొందరు సంతోషిస్తారు. ఈ రెండు రకాల వారిలో ఎవరిని సంతోషపెడతావో నువ్వే డిసైడ్ చేసుకోవాలి!
 4. టైస్టులకు ఈ నాగరిక సమాజంలో బతికే అర్హత లేదు. వాళ్లు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. అమాయకుల్ని పొట్టన బెట్టుకుంటున్నారు. ఒక అమాయకుణ్ని చంపడమంటే మానవత్వాన్నే చంపడం! 
 5.  ‘అవకాశం’ అనే మాట వెనుక ఓ మిస్టరీ ఉంది. అదేమిటంటే... మన దగ్గరకు వచ్చినప్పుడు అది మనకు అంతగా అవసరం లేనిదనిపిస్తుంది. కానీ చేజారిపోయాకే... దాని ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది! 

Sadhguru Jaggi Vasudev

 1. ఆశ పడటంలో తప్పు లేదు. ప్రతి ఒక్కరు ఆశను పెంచుకోవాలి.ఆశ లేనిదే ఏ ప్రపంచం లేదని గుర్తించాలి.
 2. సంతోషాన్ని ఎవరి కోసమో ఎందుకోసమో పణంగా పెట్టొద్దు. మీ సంతోషం మీదే.ఆ సంతోషం హాయిగా అనుభవించండి.
 3. స్వార్ధం లేకపోతే నీవు ఎదగలేవు. నీకంటూ  ఏది మిగులదు కనుక మనకు స్వార్ధం కావాలి.

Sekhar Kapoor


 1. నిన్న మొన్నటివరకు గడాఫీని పొగిడిన వివిధ దేశాధినేతలు ఇప్పుడు అతని చావును స్వాగతిస్తున్నారు. గడాఫీని క్రూర నియంతగా పోలుస్తున్న ఐరోపా దేశాధినేతలు దశాబ్దాలుగా ఎక్కడున్నారు? చమురు రాజకీయాల్లో నైతిక విలువలుకు స్థానమెక్కడ?
 2. ఒక వ్యక్తి పదవిలో ఎక్కువ కాలం ఉంటే, ‘నాకు పరిపాలించే హక్కు ఉంది’ అని తనకు తనే అనుకోవడం మొదలుపెడతాడు. అది మానవ స్వభావం!
 3. మనం గాంధీజీని మహాత్ముడంటూ పూజిస్తాం. కాని ఆయన చెప్పిన మంచిని మన జీవితాల నుంచి వేరు చేస్తున్నాం. మనం ఆయనను నిలుపుకోవాల్సింది మన మనసుల్లో... గోడకున్న పటాల్లో కాదు!
 4. మన దేశంలో మేధావులు అనుకుంటున్న కొందరు మాట్లాడుతున్న మాటలు కేవలం మాటలు మాత్రమే. వాటి కంటే ఆకలేసినప్పుడు ఓ జంతువు అరిచే అరుపులకు ఎక్కువ అర్థం ఉంటుంది!
 5. ఏ కళ అయినా సమాజం యొక్క మనస్సాక్షిని ప్రతిబింబించాలి. సినిమా కూడా ఒక కళే. మరి నేటి సినిమాలు ఆ పని చేస్తున్నాయా?