Showing posts with label R. Show all posts
Showing posts with label R. Show all posts

Monday, July 09, 2012

Rana Daggupati(Actor)














  1. జీవితం ఓ పజిల్ లాంటిది. ఈ రోజు నువ్వు ఏదైనా  పోగొట్టుకుంటే ,ఏదో  ఒక రోజు  దాన్ని మళ్లీ  వెతికి పట్టుకోగలవు.
  2. భయం ఎప్పుడూ  అబద్ధమే చెబుతుంది.
  3. మీ ఆలోచనలను,చర్యలను మార్చుకోండి. అప్పుడు మీ తలరాతను  మీరు తేలిగ్గా  మార్చుకోగలరు..
  4. మనం కళ్ళతో స్వయంగా చూడనిదాన్ని చెవులారా విననిదాన్ని ...మనకున్న కాస్తంత జ్ఞానంతో  విశ్లేషించ కూడదు..మన నోటితో దాన్ని మరొకరికి   చెప్పకూడదు..
  5.  ప్రతిదీ చివరకు సుఖాంతం అవుతుంది. ఒకవేళ సుఖాంతం   కాలేదంటే అది అసలు అంతమే కాదన్నమాట.
  6. మనుషులు రెండు రకాలు. వర్తమానంలో  జీవించేవారు  ఒక రకమైతే , ఎక్కడా  జివించలేనివారు రెండో  రకం. 
  7. నమ్మేగుణం ఋజువులు  అవసరం లేదు. నమ్మని వ్యక్తుల్ని నమ్మించడానికి  ఋజువులు  సంపాదించడం అసాధ్యం .
  8. మన ఆలోచనలు,మాటలు ,చేతల మధ్య ఖచ్చితంగా  పొంతన వుంటే, ఫలితం  అత్యంత సులువుగా వస్తుంది.
  9.   చక్కని  ప్రణాళికకు   మంచి  ఊహాశక్తిని  జోడిస్తే గొప్ప  విజయాలను  పొందగలుగుతాము. ఊహాశక్తి కొరవడిన ప్రణాళికలు  మన  పనిని నాశనం చేస్తాయి. 

Thursday, May 17, 2012

Richard J Star

  1. అందమైన రచన గాని, ఆకర్షవంతమైన భాషగాని, భావంలో పసలేనప్పుడు మర్చిపోవడం కద్దు.

Saturday, February 11, 2012

Ramana Maharshi













  1. భగవంతునికి నీవు ఎంత దూరంలో వుంటే, భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు.
  2. తనను తానూ పాలించుకోలేనివాడు  ఇతరులను పాలించాలనుకోవడం విచిత్రం.
  3. స్పష్టత లేకుండా మాట్లాడటం కంటే మౌనమే మిన్న. 
  4. ఈ జగత్తు దేనిలో ఉంది? ఇదంతా ఏమిటి? దేని నుంచి ఇది ఆవిర్భవించింది? దేని కొరకు మరియు దేని చేత ఇది దృశ్యమానం అయ్యింది దేనిని ఇది కలిగియుంది?
    ఆత్మయే ఏకైక కారణం.
  5. నిజానికి ఉన్నది 'ఆత్మ' మాత్రమే. ప్రపంచం, జీవాత్మ, భగవంతుడు అన్నీ దానిలోని దృశ్యాలు. ఈ మూడు ఏకకాలంలో గోచరిస్తాయి, ఏకకాలంలో అదృశ్యం అవుతాయి. 
  6. ఈ శరీరంలో 'నేను' అంటూ లేచేదే మనస్సు.
  7. ఎవరైనా అసలు ఈ నేను అన్న తలంపు ఎక్కడ నుంచి వస్తుందో అని విచారణ చేస్తే అది హృదయం నుంచి ఉద్భవిస్తుంది అని కనుగొంటారు.
  8. మనస్సు నుంచి వచ్చే అన్ని ఆలోచనలలోకి 'నేను' అనే తలంపే మొదటిది. ఇది లేచిన తరువాతనే ఇతర తలంపులు వస్తాయి.
  9. ఉత్తమ పురుష అయినా 'నేను ' లేకుండా మద్యమ, ప్రథమ పురుష ఉండవు.
  10. ఈ 'నేను' ఎవరు అనే విచారణ అన్ని ఇతర తలంపులను నాశనం చేసి, చితిని రగ్ల్చే కట్టె చివరకు ఆ చితిలోనే పడి నశించే విధంగా, తాను కూడా చివరకు నశిస్తుంది.
    అప్పుడు ఆత్మ సాక్షాత్కరమవుతుంది.
  11. ఏది చూడబడుతూ జగత్తుగా ఉందో అది తొలగినపుడు, 'దృక్ ' అయిన ఆత్మ సాక్షాత్కర్స్తుంది. అదే చూచేవాడు.
  12. కల్పితమైన 'పాము' అనే అజ్ఞానపు భ్రమ తొలగితే గానీ దానికి ఆధారమైనది తాడు అనే జ్ఞానం ఎలా కలుగదో, అటులనే 'ప్రపంచం నిజం ' అనే విశ్వాసం తొలగనంతవరకు దానికి ఆధారమైన ఆత్మ సాక్షాత్కరించదు.
  13. దేనిని మనస్సు అంటామో అది ఆత్మలోని ఒక అతీంద్రీయ శక్తి.
    అన్ని తలంపుల పుట్టుకకు కారణం ఇదే.
  14. తలంపుల సముహమే మనస్సు కాబట్టి మనసంటూ ప్రత్యేకమైనది లేదు.
  15. ఆత్మ నుంచి విడిపడిన మనస్సుకి ప్రపంచం కనిపిస్తుంది. కనుక ప్రపంచం నిజంలాగా అనిపిస్తూ ఉంటే ఆత్మ దర్శనం కాదు.
  16. సమస్త ప్రాణులూ ఎలాంటి దుఃఖము లేకుండా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాయి. ప్రతివారు తమను తాము ప్రేమించుకొనడం గమనిస్తాం.
    ఈ ప్రేమకు కారణం ఆనందమే.
  17. మనస్సణిగిన గాఢ నిద్రలో అనుభవమవుతున్న తన సహజ స్వరూపం అయిన ఆనందాన్ని పొందాలంటే ఎవ్వరైనా తన ఆత్మను గురించి తెలుసుకోవాలి.

    దీనిని సాధించాలంటే 'నేను ' ఎవ్వరు? అనే విచారణరూప జ్ఞాన మార్గమే ప్రధాన సాధనం. 
  18. 'నేను ' అనే తలంపు ఎక్కడ ఏ మాత్రమూ లేదో అదే 'ఆత్మ '.
    దానినే మౌనం అంటారు.
  19. ఆత్మయే జగత్తు;
    ఆత్మయే 'నేను ' ;
    ఆత్మయ భగవంతుడు;
    అంతా శివస్వరూపమైన ఆత్మే.
  20. మనసు అనేకమైన ఆలోచనలుగా విస్తరించినపుడు, ప్రతి ఆలోచన బలహీనమవుతూ ఉంటుంది. కానీ ఆలోచనలను నశింపచేయగా చేయగా మనసు ఏకాగ్రమై, దృఢపడుతుంది. 
    అలాంటి మనస్సుకు ఆత్మ విచారణ సులభసాధ్యం.  
  21. భగవంతుడు, గురువు వేరు కాదు, పులినోట బడినది ఎట్లు తిరిగిరాదో, అటుల శ్రీ గురుని కటాక్ష వీక్షణమున బడినవారు అతనిచే రక్షింపబడుదురే గాని ఎప్పటికిని అతనిచే విడువబడరు.
  22. అయినను గురువు చూపిన దారిననుసరించి పోవలయును. భగవంతుడు గానీ గురువు గానీ ముక్తిమార్గాన్ని చూపించ గలవారేగానీ, జీవుణ్ణి మోక్ష స్థితికి తీసుకొని పోరు. 
  23. ఇష్ట దేవత మరియు గురువు ఈ సాధనా మార్గాలలో అతి శక్తివంతమయిన సహాయకారులు.
  24. అయితే ఆ సహాయం సిద్ధించాలంటే  నీ ప్రయత్నం అవసరం.
  25. సూర్యుడిని చూడవలసింది నీవే కదా! కంటి అద్దాలు,సూర్యుడు నీకై చూడగలవా?
  26. ఎట్టి కోరిక,సంకల్పం,ప్రయత్నం లేకనే సూర్యుడు ఉదయించును. కేవలం సూర్యుని ఉనికితో సూర్య శిల కాంతిని వెదజల్లును, కమలము వికసించును,నీరు ఆవిరి అగును,లోకులు వివిధములైన కార్యములు నెరవేర్చుకొని విశ్రాంతి పొందుదురు.
  27. భగవంతుని ఉనికి చేతనే జీవులు వారి వారి కర్మానుసారం కార్యములు నిర్వర్తించుకొని విశ్రాంతి పొందుతారు.
  28. భగవంతునికి సంకల్పమే లేదు; ఎట్టి కర్మ ఆయనను స్పృసించలేదు ; ఎలాగంటే ప్రాపంచిక క్రియలు సూర్యుని ప్రభావితం చేయలేనట్టే.
  29. కోరికలు లేని స్థితియే జ్ఞానం. ఈ రెండును వేరు కాదు.
  30. విషయ వస్తువుల నుంచి మనస్సును మళ్లించడమే    నిష్కామ స్థితి. విషయ వస్తువులు కానరాని స్థితియే జ్ఞానం. ఆత్మను తప్ప అన్యం ఆశించని స్థితియే వైరాగ్యం లేక నిష్కామము. ఆత్మను విడువకుమ్ద్తయే జ్ఞానం.     
     

Sunday, October 30, 2011

Robert Burton












  1. మనిషి జీవితంలో సోమరితనాన్ని మించిన విషాదం లేదు.

Wednesday, October 26, 2011

RK Narayan













  1. పడుకోబోయే ముందు ఇంట్లో దీపాలను ఒకొకటిగా ఎలా ఆర్పేస్తారో, అలాగే మన ఇంద్రియాల శక్తి ఒకొకటిగా నశించి చివరకు శాశ్వతమైన విశ్రాంతిని ప్రసాదించేది వృద్దాప్యం.

Monday, September 12, 2011

Ram Gopal Varma

















  1. ఏ సమయంలోనైనా నువ్వు ఎవ్వరి నుంచైనా ఏదైనా ఆశిస్తున్నావంటే  సదరు వ్యక్తి అప్పటికే నిన్ను తన అదుపులో ఉంచుకోవాలని  ప్రయత్నిస్తాడు. 
  2. ఒక 'వాస్తవం' ఉనికిలోకి  వచ్చాక  మనం ఎన్ని సిద్ధాంతాలైనా రూపొందించుకోవచ్చు.
  3. జీవితంలో తప్పులనేవి జరుగవు. వెయిట్ చేస్తే అవన్నీ ఒప్పులుగా మారుతాయి. 
  4. విభిన్నంగా ఉండటమంటే స్వతంత్ర్యంగా ఉండటమే.
  5. ఎన్ని రకాలుగా,ఎవడు,ఎందరికీ ప్రేరణ కలిగించినప్పటికీ ఎంత మంది పరిపూర్ణతకు నమూనాగా నిలబడ్డవాడైనప్పటికినీ చిట్టచివరకు చనిపోవాల్సిందే .
  6. మన మనసులో అనుకున్నదానికి,ప్రాక్టికల్ గా తీయడానికి మధ్యవున్న రేఖ చాలా బలమైనది.
  7. నా ఫ్లాప్ సినిమాలన్నీ నేను ఇంటెన్షనల్ గా తీసినవి. హిట్ సినిమాలన్నీ అనుకోకుండాసంభవించినవి.
  8. సినిమా తియ్యాలని డిసైడ్ చేసే ముందు అనుకున్నవన్నీ కరెక్టనిపిస్తాయి. కానీ ఫ్హ్లాపైన తరువాత ఇంకా కరెక్ట్ కారణాలు తెలుస్తాయి.
  9. జీవితంలో ఏదైనా  మనం మనసా వాచా నమ్మితేనే చేస్తాం. కానీ అందులో ఏది సక్సెస్ అవుతుంది?ఏది కాదు? అనేది చాలా అరుదుగా తప్ప మన ఆధీనంలో లేదు. 
  10.  వైఫల్యమంటే తీసుకున్న నిర్ణయం తప్పవడం అంతే! మనమంతా ఇతరుల తప్పులను ఎత్తి చూపడంలో,విమర్శించడంలో నిష్ణాతులం. చాలా అరుదుగా మాత్రమే మన సొంత తప్పుల్ని గుర్తిస్తాం. అంతమాత్రాన అది అపజయపు దారుల్లో అడుగు పెట్టకుండ మనల్ని ఆపదు.
  11. పుట్టిన తరువాత ఏం చేసావన్న దాంట్లో సెలెబ్రేషన్ ఉండాలి. కానీ పుట్టినందుకే సెలబ్రేట్ చేసుకునేవాళ్లు అత్యంత మహా చేతగాని వాళ్లని నా నమ్మకం.

Sunday, August 21, 2011

Ricky Ponting

















  1. క్రికెట్లో ప్రపంచకప్ అత్యుత్తమ టోర్నీ. అందరూ ఈ టోర్నీని గుర్తుంచుకునే విధంగా పోరాడతాం.

Sunday, August 14, 2011

Rajiv Gandhi

















  1. సామాజిక అన్యాయం మతం వెనుక దాగి ఉంటుంది.
  2. మన శాసనాలు నైతికత ప్రస్తుత అవసరాలతో ముడిపడి ఉండాలి.

Thursday, July 21, 2011

Rajaji

















  1.  ఒక్కోక్కటిగా పడే చుక్కలతో కడవ నిండిపోతుంది. అదే విధంగా విద్యలైనా, ధర్మమైనా,ధనమైనా కొంచెం,కొంచెంగా సేకరించుకుంటూపోతే ఓ విశాలమైన సంగ్రహం లభిస్తుంది.      

Tuesday, July 19, 2011

Robert Brault















  1. ప్రతిరోజు మనకొక అవకాశమే.

Rosalynn Carter

















  1. నీ సామర్థ్యం మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ధైర్యంగా దానిని అనుసరించాలి.     

Wednesday, June 01, 2011

Richard Bach

  1. నిజమైన ప్రేమకు అంతం ఉండదు.

Ralph Waldo Emerson

















  1. మనిషి ఆశలను అతనికున్న జ్ఞానాన్ని బట్టి అంచనా వేస్తాము.
  2. జీవితం ఎంత చిన్నదైనా మర్యాదకు ఎప్పుడూ సమయం ఉంటుంది.
  3. దేవుడు అదృష్టానికి కల్పించిన ముద్రే అందం.
  4. అందం భగవంతుని దస్తూరి. 
  5. కల అసూయాపరురలైన    భార్య.
  6. అత్యంత నిరుపేదలే చరిత్రలో అతిగొప్పవారు. 
  7. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఆలోచించడం.
  8. అత్యంత నిరుపేదలే చరిత్రలో అతిగొప్పవారు.

Robert Frost

















  1. వెళ్ళిన వెంటనే ప్రేమగా నిన్ను లోపలి తీసుకువెళ్లేదే ఇల్లు.

Wednesday, May 04, 2011

Ravindranath Tagore
















  1. అసమర్ధులకు అవరోధాలుగా కనిపించేవి సమర్ధులకు అవకాశాలుగా కనిపిస్తాయి.
  2. జీవితంలో వైఫల్యాలు భారమని గ్రహించేవారు,వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు.
  3. మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజూ, క్రితం రోజుకన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలను నేర్చుకోవాలి.
  4. నేను పని చేస్తే భగవంతుడు నన్ను గౌరవిస్తాడు. అయితే నేను గానం చేసినపుడు ఆయన నన్ను ప్రేమిస్తాడు.
  5. కళ్లకి రెప్పలు ఉన్నట్లే పనికి విశ్రాంతి ఉండాలి.
  6. ప్రేమించే వ్యక్తికీ దండించే అధికారం కూడా ఉంటుంది.
  7. భర్తకి లోకమంతా ఇల్లు, అయితే స్త్రీకి ఇల్లే లోకం.
  8. వెలిగే దీపంలాగా ఉండు. అప్పుడే ఇతర దీపములను వెలిగించవచ్చు.
  9. ప్రేమ గుణం బాగా పెరిగితే లభించే సంపద-పవిత్రత.
  10. సృష్టి రహస్యాన్ని విశదం చేయగల శక్తి తర్క కౌశలానికి లేదు.
  11. మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీల మధ్యలో పురుషులు పసిబిడ్డలు.
  12. మనిషి జీవితంలో మహదాశయాలూ శిశువుల్లా అవతరిస్తుంటాయి.
  13. ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే 'కళ'.
  14. నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది.