Friday, October 12, 2012

Susmitha Sen



















  1. మీరు ఎవరి నుంచి ఏమీ ఆశించకండి. నిజాయితీగా వ్యవహరించండి. మీరు అలా ఉండగలిగితే, మిమ్మల్ని చూసి మిగిలినవాళ్లు కూడా అలాగే ప్రవర్తిస్తారు!
  2. నువ్వు అందరితో మంచిగా ఉంటావు కాబట్టి అందరూ నీతో మంచిగా ఉండాలని కోరుకోవడం అమాయకత్వమే అవుతుంది. అలా కోరడం ఎలా ఉంటుందంటే... నేను నిన్ను తినను కాబట్టి నువ్వు కూడా నన్ను తినకు అని సింహాన్ని అడిగిన ట్టుంటుంది!
  3. మనం ఏ విషయంలోనైనా ఫెయిలయ్యాము అని అన్నామంటే, మనం దాన్ని సాధించడానికి అస్సలు ప్రయత్నించనట్టు లెక్క. ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ ఉండదు!
  4. భారతీయు రాలినైనందుకు నేనెప్పుడూ గర్వపడు తుంటాను. ఇంత గొప్ప దేశానికి మొట్టమొదటి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తెచ్చినందుకు ఇంకా గర్వపడతాను!
  5. స్వచ్ఛమైన, పారదర్శకమైన సామాజిక, రాజకీయ వ్యవస్థ పౌరుల హక్కులను కాపాడగలుగుతుంది. అవినీతి మాత్రం వాటికి భంగం కలిగిస్తుంది. అందుకే లోక్‌పాల్ బిల్లు పాస్ అయ్యి తీరాలి!
  6. దేనినైనా మన బలంతో సాధించాలి కానీ అవతలివారి బలహీనతతో కాదు. ఎందుకంటే, నిజమైన గెలుపు మన కృషి వల్లే లభిస్తుంది తప్ప, అవతలి వారు ఓడిపోవడం వల్ల కాదు!
  7. స్త్రీకి పురావస్తు శాస్త్రవేత్తకంటే ఉత్తమమైన భర్త ఎవరూ ఉండరు. ఎందుకంటే అతడికి మాత్రమే పాతబడేకొద్దీ భార్య మీద ప్రేమ పెరుగుతుంది! 
  8. దేనినైనా దీర్ఘకాలం పాటు నిర్లక్ష్యం చేస్తే, సమస్య మరింత తీవ్రతరమవుతుంది. నిద్రపోతున్న సమాజాన్ని లేపడానికి ఎవరో ఒక సమర్థుడు నడుం కట్టాలి!

No comments:

Post a Comment