- నా మనసెప్పుడూ అభివృద్ధి గురించే ఆలోచిస్తోంది. దేశాన్ని ముందుకు నడిపించడానికి నేను ఏ పార్టీతోనైనా, ఏ వ్యక్తితోనైనా కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను!
- రేపటిని నిర్మించుకోవాలనుకున్నప్పుడు నాయకత్వం కోసం పోటీ పడుతున్న ఇద్దరు వ్యక్తులనో, రెండు పార్టీలనో దృష్టిలో పెట్టుకోకూడదు. ఆ ఇద్దరి దృక్పథాలనూ మనసులో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి!
- సమాజంలో రావాల్సిన మార్పేమిటో మనకు తెలుసు. ఆ మార్పుకోసం మనం ఏం చేయాలో కూడా మనకు తెలుసు. అది చేయడం అంత తేలిక కాదని కూడా తెలుసు. అయితే అందరూ చేతులు కలిపితే తప్పక సాధించగలం!
- నువ్వొక్కడివీ ఓటు వేయకపోతే వచ్చే నష్టమేమీ ఉండదని అనుకోవద్దు. నీ స్వరం వినిపించినా పెద్దగా ఉపయోగం ఉండదని ఎవరైనా అంటే నమ్మవద్దు. నీ ఒక్కడి ఓటూ చరిత్రను మార్చగలదు. నీ స్వరం కొన్నిలక్షల మంది ఆలోచనల్ని ప్రభావితం చేయగలదు!
- చక్కని ఆరోగ్యం, మంచి ఉద్యోగం చేయడం వంటివి వ్యక్తిగత విషయాలు కాదు. ఓ దేశం ఎంత అభివృద్ధి చెందిందో చెప్పడానికి అవి నిదర్శనాలు!
Showing posts with label B. Show all posts
Showing posts with label B. Show all posts
Sunday, November 25, 2012
Barack Obama
Monday, July 16, 2012
Wednesday, May 30, 2012
Bill Gates
- కంప్యూటరును ఇష్టపడనివారు ఉన్నారు. అయితే,కంప్యూటర్ ఇష్టం, మైక్రోసాఫ్ట్ అంటే ఇష్టం లేదని ఎవ్వరూ ఇక్కడ చెప్పుట లేదు.
- ఎప్పుడైతే పర్సనల్ కంప్యూటర్ ప్రారంభమైందో, ప్రజలు అది ముఖ్యమైనదని తెలుసుకున్నారు.
- జీవితం తెలుపు కాదు;దానిని పొందేందుకు ఉపయోగించు.
- ప్రజలు ప్రతిచోటా విండోస్ ను ప్రేమిస్తున్నారు.
- టీకాలు వేయించుకునే హక్కు పిల్లలందరికీ ఉంది. ప్రపంచంలో ఉన్న చిన్నారులందరినీ రక్షించుకోవడానికి వ్యాక్సిన్లే మనకు మంచి మార్గం!
- పిల్లల జీవితానికి సంబంధించి ఏది జరిగితే అది జరుగుతుందిలే అన్న భావన తల్లిదండ్రుల్లో ఉండకూడదు. పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేసే సామర్థ్యం ప్రతి తల్లికీ తండ్రికీ ఉండాలి.
- గొప్ప విద్యను ఆశించడం విద్యార్థుల హక్కు. వారు ఆశించినదానికంటే గొప్ప విద్యను అందించడం, భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి వారికి సహకరించడం ఉపాధ్యాయుల బాధ్యత!
- మనమందరం తలచుకుంటే రైతులకు సాయం చేయవచ్చు. కాస్త చిత్తశుద్ధితో సహకరిస్తే లక్షలాది మందిని తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయవచ్చు!
- సమస్యలను పరిష్కరించడం అంత కష్టమేమీ కాదు. కాస్త ఏకాగ్రత, నిబద్ధతతో పని చేస్తే సమస్యలను పరిష్కరించుకోవడమే కాదు, ఏ పనిలోనైనా అద్భుతమైన విజయాల్ని పొందగలం!
- సేకరణ: అనూష (సాక్షి)
Sunday, March 11, 2012
Tuesday, November 01, 2011
Wednesday, October 26, 2011
Bruce Lee
- ముందు నీ లక్ష్యాన్ని నిర్ణయించుకో, తర్వాత దాన్ని సాధించడం కోసం కృషి చెయ్యి.
- ఒక మూర్ఖుడు ఓ తెలివైన ప్రశ్న నుండి నేర్చుకొనేదాని కంటే, ఒక తెలివైనవాడు ఒక మూర్ఖత్వపు ప్రశ్న నుండి నేర్చుకొనేదే ఎక్కువ.
- జ్ఞానం నీకు శక్తిని ఇస్తుంది, కాని వ్యక్తిత్వం గౌరవనిస్తుంది.
- నిజంగా జీవించడమంటే ఇతరుల కోసం జీవించడమే.
- 10,000 గుద్దులను ఒక్క సారి అభ్యసించినవాడంటే కూడా నాకు భయం లేదు, కానీ ఎవడైతే ఒక్క గుద్దును 10,000 సార్లు అభ్యసించాడో వాడంటేనే భయం నాకు.
Sunday, October 09, 2011
Bertrand Russell
- ఇతరులకు మనం మేలు చేసి దానిని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు. మనకు మేలు చేసినవారిని ఎప్పుడు మర్చిపోవద్దు.
- కుర్రాళ్లు తెలివైన వాళ్లైతే అదుపు చేయడం కష్టం.
- నువ్వు కోరిన ప్రకారం నడవాలంటే, ప్రార్ధన,అణుకువ కాదు, కావలసింది జ్ఞానం.
- అత్యాశ అతికష్టాలలో ఉధ్భవిస్తుంది.
- అత్యంత అదృష్టకర జీవితాల్లో కూడా నష్టాలొచ్చే సందర్భాలు వుండకపోవు.
- ప్రపంచం విశాలం,మన శక్తి పరిమితం.
Tuesday, September 20, 2011
Sunday, August 14, 2011
Bhagat Singh
- ప్రతి మనిషి ఆత్మ శోధన, స్వయం సమీక్ష చేసుకుంటూ నిబద్ధతతో ఆశావాదిగా జీవితాంతం కొనసాగించడం గొప్ప విషయం.
- ఆదర్శాలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనమేమి? వాటిని ఆచరణలో పెట్టినపుడే సార్ధకత.
- ఇంక్విలాబ్ జిందాబాద్.
- దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు.
- మనుషులను చంపగలరేమో కాని, వారి ఆదర్శాలను మాత్రం కాదు.
- పరిస్థితుల దృష్ట్యా నేను తీవ్రవాదిగా నటిస్తున్నా, నిజానికి నేను తీవ్రవాదిని కాను.
- బాంబుదాడుల ఉద్దేశ్యం ప్రజలను బలితీసుకోవడం కాదు, బ్రిటీష్ దాస్యశృఖంలాల నుంచి భరతమాతను విడిపించడం.
Tuesday, July 19, 2011
Wednesday, June 01, 2011
Thursday, August 19, 2010
Benjamin Franklin
- మరణానంతరం కూడా గుర్తుండాలంటే చదవదగిన పుస్తకాలు వ్రాయి లేదా వ్రాయదగిన పనులు చెయ్యి.
- ఖాళీ సమయం కావాలనుకుంటే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి.
- కారణం లేకుండా ఎవరికి కోపం రాదు. అయితే ఎప్పుడో గాని సరైన కారణం ఉండదు.
- తృప్తి పేదవాడ్ని ధనవంతుడిగా చేస్తుంది. అసంతృప్తి గొప్పవాణ్ణి పేదవాడిగా మారుస్తుంది.
- కోపంతో మొదలుపెట్టిన పని తప్పనిసరిగా అవమానాల పాలౌతుంది.
Subscribe to:
Posts (Atom)










