Showing posts with label J. Show all posts
Showing posts with label J. Show all posts

Monday, July 16, 2012

J K Rowling















  1. ఆత్మీయ బంధాలలో అధిక నష్టాన్ని కలిగించేవి ఎదుటివారి పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యం.

Thursday, June 28, 2012

Javed Akhtar
















  1. నేను భారతీయుడిని. ఎటువంటి మతవాదమైనా నాకు నచ్చదు. హిందూ, ముస్లిం మతాల సంప్ర దాయ వాదులు నాపై విరుచుకు పడుతుంటారు. వారి బెదిరింపులకు నేను భయపడను. 
  2. గత 20 ఏళ్లుగా ముద్రిస్తున్న డిక్షనరీల్లో ఒక పదం గురించి ఎటువంటి వివరణ లేకుండా ముద్రిస్తున్నారను కొంటా. నేటి తరానికి పరిచయం లేని ఆ పదమే ‘డిగ్నిటీ’!
  3. ఇంతకీ అన్నా హజారే కోరుకుంటోంది ఏమిటి? ప్రభుత్వం ఇస్తానంటున్నది ఆయనకు అవసరం లేదా లేక ఆయన అడిగింది ప్రభుత్వం ఇవ్వట్లేదా! 
  4. నేను ముస్లిముల ఆచార వ్యవహారాలను తప్పుపడితే కొంతమంది మూఢులు నాపై ఫత్వాలు జారీ చేస్తారు. 
    చంపేస్తామంటారు. అదే హిందువులను విమర్శిస్తే నన్నే మూఢుడు అని అంటారు. ఇది కొంచెం బెటరేమో!
  5. నేను పక్షపాతంతో మాట్లాడతాను, కొన్ని విషయాల్లో నోరు తెరవను అనేవాళ్లు చెవిటివాళ్లు అని నా అభిప్రాయం. ప్రతి అనాగరికమైన అంశానికి వ్యతిరేకంగా కూడా నేను ఎలుగెత్తుతుంటా!
  6. నా అభిప్రాయాలతో విబేధించేవారు చాలామంది ఉండొచ్చు, దానికోసం వారు మొరటుగా మాట్లా డితే నేను కూడా అలాగే మాట్లాడుతా. అభిప్రా యాలను వ్యక్త పరిచే స్వేచ్ఛ అందరికీ ఉంది.

    సేకరణ: జీవన్(సాక్షి పత్రిక)

Wednesday, June 20, 2012

John Watson














  1. అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు  తడుతుందని  అందరూ చెప్తుంటారు,నమ్మవద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు. స్వంతం చేసుకో. అదే అదృష్టమంటే.

Sunday, January 29, 2012

Jackie Chan












  1. నేను ఒక స్టంట్ చేసినప్పుడు చాలా మంది ప్రజలు నన్ను అడిగారు జాకీ, మీరు భయపడుతున్నారా?'అని  నేను భయపడ్డాను  అంటాను. ఎందుకంటే నేనేమీ ధృఢ శరీరుణ్ణి కాదుగా మరి.
  2.  అమెరికా ప్రేక్షకులకు ఏది ఇష్టం, ఏది అయిష్టం అని అర్ధం చేసుకోవడం చాలా కష్టం. కొన్ని చిత్రాలు నాకు చాలా ఇష్టం. కాని అవి పెద్దగా ఆడవు, కొన్ని చిత్రాలు నాకు అస్సలు నచ్చవు, కానీ అవి భారీ విజయాన్ని నమోదు చేస్తుండడం చాలా కష్టంగా అనిపిస్తుంది.
  3. కొన్ని సార్లు నాకు చెడు వ్యక్తి పాత్రను పోషించాలనిపిస్తుంది, అదే మరికొన్ని సార్లైతే ఆ సినిమాలో చనిపోవాలనిపిస్తుంది. 

Friday, October 21, 2011

Joseph Chilton Pearce













  1. గొప్ప పనిలో రాణించాలంటే  తప్పు చేస్తామేమోనన్న భయాన్ని వదులుకోవాలి.

Sunday, October 16, 2011

Julius Caesar













  1. తను కోరుకున్నదానినే నమ్మడం మనిషి స్వభావం.

Monday, October 10, 2011

Julia Cameron













  1. కోపం మన శక్తిని హరిస్తుంది. మన శత్రువుని బలవంతుడిని చేస్తుంది.

Sunday, September 25, 2011

Jeffrey Boycott














  1. పరీక్షకు గురి కాని ప్రతిభావంతుల్ని ఆడించండానికి క్రికెట్లో రెండు సందర్భాలుంటాయి.అవి ...వరుసగా గెలుస్తున్నపుడు....వరుసగా ఓడుతున్నప్పుడు..

Jainulabdeen

  1. ఇతరులను అర్ధం చేసుకున్నవాడు జ్ఞాని,తనను తాను అర్ధం చేసుకున్నవాడు వివేకి

Thursday, August 25, 2011

John Ruskin


















  1. ప్రపంచంలో అతి అందమైన నెమళ్లు,లిల్లీ పువ్వులు అత్యంత ఉపయోగం లేనివని మీరు గుర్తుంచుకోండి.
  2. మన ఉద్దేశ్యాలను తక్కువగా వెల్లడిస్తే, వాటిని  నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. 
  3. ఊహల్ని,గొప్ప అనుభూతుల్ని సంగీతమైన మాటల్లో వర్ణించడమే కవిత్వం.   
  4. కారణమనే పేరుతో మొహం దురాశ ప్రపంచాన్ని పాలిస్తున్నాయి.
  5. తప్పుల అడుగున ఎప్పుడు అహం వుంటుంది.
  6. మనం నిర్మాణం చేసేటప్పుడు అది భావి తరాల కోసమని గుర్తుంచుకోవాలి.
  7. నూతన తలంపులున్న  మనుషులు కష్టపడి నేర్చుకుంటారు. వాళ్లు నూతన జ్ఞానం కోసం అలమటిస్తారు.
  8.  నీ నిజాయితీ ఓ మతం మీదగాని, విధానం మీద గాని ఆధారపడి ఉండకూడదు. అది సూర్యుని వలె పగలు,రాత్రి ప్రకాశించే కాన్తివలె దేవునిపైన ఆధారపడి వుండాలి.
  9. చిన్న చిన్న నేరాలను ఉపేక్షిస్తే అవి పెద్ద ఘోరాలకు దారి తీస్తాయి.
  10. మనం అమాయకులమని మన బాధ్యతలను విస్మరించలేము.
  11.  చెప్పదలచినది తక్కువ మాటల్లో చెప్పు,లేకుంటే  పాఠకుడు  కొన్నింటిని వదిలివేస్తాడు. 
  12. రచయితను కలుసుకుంటే అతని అభిప్రాయాలు తెలుసుకో. నీ అభిప్రాయాలు చెప్పకు.
  13. కనిపించే దాన్ని వాస్తవికరించడం గుర్తింపు కోసం ప్రత్యక్షంగా చూపడం యొక్క  పని.
  14. ఎక్కువ స్వాధీనం చేసుకున్న కొద్ది ఆ బరువుతోనే క్రుంగుతాము.
  15. అందానికి రమ్యతకు తేడా ఉంది. నేను గుర్తిస్తే అందమైనది. ఆమె నన్ను  గుర్తిస్తే రమ్యమైనది.   

Sunday, August 14, 2011

John Keats


















  1.   అనుభవంలోకి వస్తే కాని ఏదైనా నిజం కాదు. అనుభావపూర్వం కాని సూక్తి సూక్తి కాదు.
  2. భవిష్యత్ విపత్తు ఉహకందదు,రాబోయే విజయాన్ని గ్రహించలేము. అందుకే ఆత్మవిశ్వాసమే ఆయుధం.
  3. గొప్ప  సంకల్పంలో ఓటమి నరకం కంటే భయానకం.
  4. కొంచెం సేపు నవ్వనివ్వండి, బాధపడటానికి ఎంతో సమయం మిగులుతుంది.
  5. అపనమ్మకంతో జరిగే పాలనకు ముగింపు అనివార్యం. 


Friday, August 05, 2011

Jesus Christ

















  1. మనుష్యుడు రొట్టెవలన  మాత్రము కాదుగాని దేవుని నోట నుండి ప్రతి మాట వలనను జీవించును.
  2. నా వెంబడి రండి నేను మనుష్యులను పాట్టు జాలరులనుగా చేతును.
  3. ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
  4.  దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు.
  5. సాత్వికులు ధన్యులు;వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
  6. నీతి కొరకు ఆకలిదప్పులు  గలవారు ధన్యులు

Tuesday, July 19, 2011

Jayaprakash Narayan


















  1. "ఆత్మహింస" అనే గేమును ప్రవేశపెడితే అందులో గోల్డ్,సిల్వర్,బ్రాంజ్ అన్ని పతకాలు మనకే దక్కుతాయి.      

James Baldwin



















  1. ఎదురయ్యే  ప్రతిదాన్ని మార్చలేము కాని అది ఎదురవ్వనంత వరకు ఏదీ మార్చలేము.

Sunday, June 26, 2011

Joshua Liebman

















  1. జీవితమంతా సమస్యలు ఎదురైనా, భయపడకుండా ఎదుర్కోవడమే పరిపక్వత.

Wednesday, June 01, 2011

Jim Bishop
















  1. గడిచిన నిమిషం కన్నా ఏది దూరం కాదు.

Jonathan Murray

















  1. గొప్పగా ఆలోచించేవాళ్లకు   జీవితం చాలా చిన్నదిగా కనిపిస్తుంది.

Jules Renard

















  1. ఓటమి సోమరితనానికి ప్రతిఫలం.

John Gielgud

















  1. మనం ఏదైనా చేసే ముందు, మనలో ఎంతో కొంత సామర్థ్యం ఉండి తీరాలి.

John Wanamaker

















  1. ఉల్లాసాలకు తీరిక లేదనే వారు కాస్త ముందో వెనకో అనారోగ్యాలకు సమయం కేటాయించవలసి వస్తుంది.