Showing posts with label N. Show all posts
Showing posts with label N. Show all posts

Wednesday, May 30, 2012

Nallamothu Sridhar



  1. ఏదో సాధించాలన్న తపన మనసు లోతుల్లో జ్వలించకపోతే దేహం నిర్జీవమైపోతుంది. కాంక్ష మనసుకూ, శరీరానికీ జీవశక్తినిస్తుంది. కాంక్షే ఆవిరైపోతే అన్ని శక్తులు హరించుకుపోతాయి.
  2. మనలోని శక్తికేంద్రం నుండి ఉద్భవించే శక్తిని ఏ పనులకై వినియొగిసున్నామన్న దాన్నిబట్టే ఈ క్షణం మనం ఉన్నాం. 
  3. మనలో ఏదైనా శూన్యత,అసంతృప్తి ఏర్పడితే దాన్ని వెంటనే గుర్తించి వీలైనంత త్వరగా చక్కని లక్ష్యాన్ని నిర్దేశించకపోతే మానసికంగా వ్యాకులత ఆవరిస్తుంది.
  4. ఏదో ఒక లక్ష్యం నిరంతరం మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. లక్ష్యం నిర్దేశించకపోవడం తెలియకపోతే లోపల ఉండే అగ్ని..కోరికలుగా పరివర్తన చెందుతుంది.  
  5. వాదనల్లో ఓడిపొయినంత మాత్రాన సత్యాలు అసత్యాలైపోవు.
  6. బుద్ధిచేసే తార్కిక విశ్లేషణల జల్లెడకు దొరకని అంశాలెన్నో మనసుని తాకుతునే ఉంటాయి.
  7. మితిమీరిన తర్కం అహాన్ని పెంచుతుంది.
  8. దేన్నయినా మూర్ఖంగా వాదించే తత్వం వదిలేయాలి. లేదంటే అందరూ మనల్ని అంగీకరిస్తున్నట్లు భ్రమింపజేస్తునే మనల్ని తమ పరిధి నుండి బహిష్కరిస్తుంటారు.
  9. మన లక్ష్యాలు ఉన్నతమైనవి. కానీ వాటిని సాధించడానికి అనుసరించే మార్గాలోనే లోపమంతా.
  10. ఎంత గొప్ప లక్ష్యమైనా నిజాయితీ,స్వచ్చత లేకుండా సాకారమైతే అపరాధభావానికి గురిచేస్తుంది.
  11. మనం సరిగ్గా ఎదగలేకపోతున్నామంటే అది మన తప్పు తప్ప ఎదుట వ్యక్తి మనపై ఏదో కుట్ర చేస్తున్నారని ద్వేషం పెంచుకోవడం అర్ధరహితం. 
  12. లక్ష్య సాధన అనేది ఎలాగైనా పూర్తిచేయొచ్చు..కాని వినమ్రంతో కూడిన విజయం, ఎవరిని గాయపరచకుండా, నొప్పించ కుండా సాకారమైన లక్ష్యం మన జీవితానికి అర్ధాన్నిస్తుంది.  
(కంప్యూటర్ ఎరా సౌజన్యంతో,శ్రీధర్  గారి అంగీకారంతో వారి సంపాదకీయాల నుండి సేకరించినవి)






Sunday, May 20, 2012

Nepoleon Hill












  1. అలుపెరుగని పోరాట యోధునిదే అంతిమ విజయం.

Nelson Mandela












  1. చదువు క్రమశిక్షణనను  అలవరుస్తుంది. చూపును విశాలం చేస్తుంది.చదువుకున్న పౌరులు లేకుండా  ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు. కట్లు తెంపుకోవడానికి కత్తిలాంటి ఆయుధం చదువొక్కటే.
  2. నీకివ్వలసిన గౌరవం ఇస్తునే నా హక్కుల కోసం నీతో పోరాడతాను.  
  3. ఊచలకు ఇటు మేము ఉన్నాం,అటు మీరు ఉన్నారు.అంతే తేడా. అందరం ఒక్కటే.అన్యాయం అని తోచినప్పుడు మన ఆగ్రహాలలో మాత్రం ఎందుకు ఎక్కువ తక్కువలుండాలి?
  4. నువ్వు మంచివాడివే కానీ,తప్పని పరిస్థితులలో చెడ్డవాడివి కాబడుతున్నావు. ఆ విషయం నాకు అర్ధమైంది.
  5. ప్రత్యర్దిని అగౌరవపరచకుండానే నేనతడినీ ఓడించగలనని అర్ధమైంది.
  6. జీవితాన్ని మీరెంతగా ప్రేమించారో నేనూ అంతే ప్రేమించాను.స్వేచ్చగా జీవించాలన్న మీ హక్కు,నా హక్కు వేర్వేరు కాదు. మన హక్కుల్ని విక్రయించేందుకు తెల్లజాతి ప్రభుత్వానికి నేనెలాంటి వాగ్దానం చెయ్యలేను. 
      

Narendra Modi












  1. సత్యం,స్వచ్చత,స్వార్ధ రహిత ఆలోచనలను కలిగినవారు..తమను ప్రపంచమంత వ్యతిరేకించినా భయపడాలిసిన అవసరం లేదు.
  2. మహిళాభ్యుదయానికి కృషి చేయకుండానే దేశాన్ని, ప్రపంచాన్ని బాగుపర్చడం అనేది అసాధ్యమైన పని,ఏ మాత్రం అవకాశం లేని పని.
  3. ఉల్లాసంగా ఉండే మెదడు ఒక విషయంపై స్థిరమైన అభిప్రాయానికి రావడానికి సాయపడుతుంది.తెలివి తేటలున్నప్పటికీ కొన్ని బంధనాల మధ్య కట్టడి చేసుకొన్న మెదడు వేయి రకాల డిఫికల్టిస్ ను సృష్టిస్తుంది.
  4. పరిపూర్ణత అనేది నమ్మకంతోనో, వ్యక్తిగత విశ్వాసాలతోనో వచ్చేది కాదు. నిస్వార్ధంగా కష్టపడటం, ఒళ్లు  దాచుకోక శ్రమించడం ద్వారానే అది సాధ్యమవుతుంది.
  5. విశ్వం,దేవుడు....రెండూ వేరు వేరు కాదు.ప్రపంచమే ఒక భగవత్స్వరూపం.సృష్టికారుడి మాయ. ఆ అద్భుత స్వరూపాన్నే మనం ప్రపంచంగా పిలుచుకొంటున్నాం.    

Monday, September 12, 2011

Niels Bohr

















  1. నీ గురించి నువ్వు లోపల అనుకున్నంతగా బయటికి చెప్పుకోకు.

Sunday, August 14, 2011

Neil Armstrong

















  1. డబ్బుగాని, విజయంగాని మానవాళి మనుగడకు, శాంతిసామరస్యాలకు ఉపయోగపడాలి.

Saturday, July 30, 2011

Narla Venkateswara Rao

 



  1. ఆశలేని ప్రాణి అణగారిపోతుంది. ఆశ చంపుకోవడం ఆత్మహత్య. 
  2. ఉక్కు మనిషి ఎవడో, ఊకమూట  ఎవడో కష్ట కాలమందే స్పష్టపడును. ఉత్త వేళలందు ఉత్తములందురు.
  3. అవిటివానికేల అభినయశాస్త్రం? చెవిటి వానికేల  కవులగోష్టి? 
  4.   ప్రశ్న ప్రగతికి మూలం.
  5. అస్పృశ్యులని  మనం అందరిని దూరం నెడితే మనల్ని వెనక్కి నెట్టి ప్రపంచం ముందుకు పోతుంది.
  6. ప్రశ్నలేని  జగత్తు ప్రశ్నార్ధకం.

    Thursday, July 21, 2011

    Norman Bethune
















    1.   మోకరిల్లి బతకడం కన్నా,మన కాళ్లపై మనం నిలబడి మరణించడమే మేలు.            

    Friday, May 06, 2011

    Nepoleon Bonaparte















    1. నువ్వు నాకు తల్లినిస్తే ....నేను నీకు మంచి దేశాన్నిస్తాను.
    2. యుద్ధం అనేది అనాగరికులు చేసే వ్యాపారం.
    3. ప్రతి నిముషాన్ని వ్యర్ధం చేయక వినియోగించుకో, లేకుంటే నీవు వృధా పుచ్చిన కాలం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది.
    4. నాయకుడంటే ఒక ఆశాసౌధం లాంటివాడు.
    5. ప్రపంచంలో మేధావులందరి కన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు.
    6. నన్ను కాలం  తప్ప మరేదైనా అడుగు, అదొక్కటే నా  చేతిలో లేదు.
    7. మనము నిరుపేదగా ఉండడానికి భగవంతుడు కారణం కాదు, మనమే కారణం. మొదట నిజమైన కారణాన్ని తెలుసుకుందాము. తరువాత దీపం వెలిగించి పెట్టి భాద్యత కొరకు అగ్గిపుల్లను వెతుకుదాము.
    8.  ఒక్క కాలం తప్ప మరేదైనా మన చేతిలోనే ఉంటుంది.
    9.  వెయ్యి తుపాకుల కంటే వ్యతిరేకించే నాలుగు వార్తాపత్రికలకు  భయపడాలి.
    10. అవకాశం రానప్పుడు, అవకాశాన్ని సృష్తించుకోలేనప్పుడు ఎంత సమర్ధత ఉన్నా నిష్ప్రయోజనమే.