- ప్రతి ప్రగతి అనిశ్చయమే, ఓ సమస్యకు పరిష్కారం దొరికేలోపు మరో సమస్య ఎదురౌతుంది.
- ఫ్లోరిడాలో ఎస్కిమోలు ఎంత మందున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కమ్యునిస్టులు అంత మంది వున్నారు.
- ప్రతి వస్తువు విలువ కాలాన్ని బట్టి వుంటుంది.
- నిజం చెప్పాలంటే కాలం తటస్థం. అయితే దాన్ని విచ్చిన్నానికి, నిర్మాణానికి ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు.
- క్రీస్తు మతం నమ్మకం, దయల సమాహారం.
- మనిషి దేవుని బిడ్డ, అతని రూపంలో సృష్టించాడు. కనుక అతన్ని దేవుడిలాగే గౌరవించాలి.
- స్వర్గంలో నవ్వడం నిషిద్ధమైతే నాకు స్వర్గం చేరడం ఇష్టం లేదు.
- నీరులా న్యాయం ప్రవాహంగా ప్రవహిస్తే తప్ప మనం సంతృప్తి చెందరాదు.
- నిజాయితీ పరుడు కొందరికి శత్రువౌతాడు.
- తెల్లవాడి బావమరిదిగా ఉండే కంటే వాడికి సోదరుడిగా ఉండాలనుకుంటాను.
- పాపం మౌలికంగా దేవునికి దూరం కావడమే.
- పాపాన్ని ప్రతిఘటించకుంటే పాపానికి సహకరించినట్లే.
- తక్కువ మాటలు అదే ప్రార్ధన.
- యుద్ధం మానవజాతిని కబళించే ప్లేగు వ్యాధి.అది మతాన్ని, రాజ్యాలను,కుటుంబాలను నాశనం చేస్తుంది. దీని కంటే ఏదైనా ఉపద్రవమే మేలు.
- ఏదో ఒకరోజు నా నలుగురు పిల్లలూ...తమ చర్మం రంగుతో కాకుండా,వారి గుణ గణాలతో గుర్తించబడే దేశంలో నివసించాలనేది నా కల.
- ప్రజల్ని అనుసరించడమే నిజమైన నాయకత్వం.
Sunday, August 14, 2011
Martin Luther King
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment