- "ఒక నిజమైన విప్లవకారుడు గొప్ప ప్రేమభావం ద్వారా నడిపింపబడతాడు."
- "తుపాకీతో ఉన్న పురుషుని చేతిలోకంటే కత్తితో ఉన్న స్త్రీ చేతిలో చావడం ఉత్తమం."
- "నువ్వు నన్ను చంపడానికి వచ్చావని నాకు తెలుసు. కాల్చు, పిరికివాడా, నువ్వు కేవలం ఒక మనిషిని మాత్రమే చంపగలవు."
- "నేను పోరాటం యొక్క అమరత్వం గురించి ఆలోచిస్తున్నాను"
- "కాల్చకండి! నేను చే గువేరాని, మీకు చనిపోతేకంటే బ్రతికి ఉంటే ఎక్కువ విలువ కలవాడిని."
- "రైతుకూలీలు మాకు సహాయం అందించడంలేదు, వారు వేగులు(ఇన్ఫార్మర్స్)గా మారుతున్నారు."
- "మానవ మూలధర్మం ఓడిపోయింది. అక్కడ పోరాటపటిమ లేదు, నాయకులు లంచగొండులు, ఒకమాటలో, అక్కడ చేయడానికి ఏమీలేదు."
- "ఇది పరాజయం యొక్క చరిత్ర."
- "జీవించి ఉన్న మానవత్వం యొక్క ప్రేమ సేవచేసే చర్యల ఉదాహరణలుగా మారడానికి ప్రతిరోజూ పోరాడాలి, ఆవిధంగా ఒక చైతన్య శక్తిగా మారాలి."
- "బలహీనులైన, లొంగిఉండే మందగా భావించబడిన సామ్రాజ్యవాదంచే హీనంగా చూడబడి మరియు తిరస్కరింపబడిన సమూహాల మరియు భావాల తిరుగుబాటు. ఈ మందనే, ఇప్పుడు అమెరికా ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ తమ సమాధి తవ్వేవారుగా భావించి భయభ్రాంతమవుతుంది.ఈ న్యాయ నిర్ణయాత్మక సమయంలోనే ఈ అనామక సమూహాలు తమ స్వంతచరిత్రను తమ స్వంతరక్తంతో, గత 500 సంవత్సరాలుగా అందరిచేత అపహాస్యం పాలవుతున్న తమ హక్కులను తిరిగి ప్రకటిస్తూ లిఖిస్తారు. ఈ "ఆవేశపు అల " లాటిన్అమెరికా నేలను తుడిచిపెడుతుంది, మొదటిసారిగా చరిత్రగతిని మార్చిన కార్మికసమూహాలు తమను ఇంతకాలం మభ్యపెట్టిన సుదీర్ఘ దురాగత మత్తును వీడుతున్నారు.
- ఈ ఇతిహాసం ఆకలితో అలమటించే భారతీయుల చేత, భూమిలేని నిరుపేదలచేత, దోచుకోబడుతున్న కార్మికులచేత మరియు పురోగామిశక్తుల చేత రచింపబడింది.
- "ఒంటరిగా మరియు నిరాశగా ఉన్న ప్రజలమధ్య అత్యున్నతమైన మానవఐక్యత మరియు విశ్వాసం పెంపొందుతుంది."
- "సామూహిక చైతన్యాన్ని పణంగా పెట్టి వ్యక్తిగత దురాశను, కోరికను పెంచే విధంగా ఉంటే, దానికై తీవ్ర ప్రయత్నం, త్యాగం మరియు కష్టాలను భరించి, యుద్ధం మరియు నాశనాల ద్వారా సాధించవలసిన అవసరంలేదు"
Sunday, August 07, 2011
Ernesto Che Guevara
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment