Thursday, August 19, 2010

William Shakespeare


  1. బాలలు తల్లిదండ్రుల సంపద. 
  2. అందరినీ ప్రేమించు, కొందరినే నమ్ము, ఎవరికీ  హాని తలపెట్టకు.
  3. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ, డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టు కోవడం మాత్రం మంచిది కాదు.
  4. పిరికివాళ్ళు చావుకి ముందు ఎన్నోసార్లు చస్తూ బ్రతుకుతుంటారు,
  5. కానీ ధైర్యసాహసాలు  గలవాళ్ళు జీవితంలో ఒకే ఒక్కసారి చస్తారు. 
  6. ఒక  సారి   నీ   నమ్మకాన్ని  వమ్ము  చేసిన వారిని ఇంకెన్నడూ నమ్మకు.
  7. ప్రపంచంలో మంచి మాటలు ఎంతో కొరతతో కూడినవి అందుచే వ్యర్ధంగా పాడు చెయ్యవద్దు. 
  8. వివేక శూన్యుడైన మిత్రుడు , వివేకవంతుడైన శత్రువు కంటే ప్రమాదం.
  9. మంచి చెడు అనేది ఏమి లేదు, ఆలోచనే అలా చేస్తుంది.
  10. పుకారు అనేది ఊహలు,భావనలు,అసూయ కలిపి  ఉదాబడే పిల్లనగ్రోవి. 
  11. సద్గుణాన్ని  మించిన సౌందర్యం లేదు.
  12. దొంగవాడు ధనవంతుని దోచుకొని జీవనం సాగిస్తున్నాడు.
  13. మంచి కాలం పుడుతుందనే నమ్మకం తప్ప బలహీనులకు వేరే మందు లేదు. 
  14. మనస్సులో తప్పు చేశామన్న భావన వున్నవారు ప్రతి కళ్లు తమను చూస్తూన్నాయని తలుస్తారు.
  15. రాజకీయ నాయకులు భగవంతుణ్ణే ఎదురించే తెలివి గలవారు. 
  16. మనసు తప్ప కొరత ఉన్నది ప్రకృతిలో వేరే లేదు. ప్రేమ లేనివారే అంగ విహీనులు.
  17. నిజమైన నమ్మకం వివేకవంతమైనది. పక్షి కంటే అది వేగంగా ఎగురుతుంది. రాజులను అది దేవతలను చేస్తుంది. సామాన్యులను అది రాజులను చేస్తుంది.
  18. ఎప్పుడు మనం అదృష్టం అనే దేవతను అధికముగా కోరుకుంటున్నమో అప్పుడు ఆ దేవత మనను ఎక్కువగా దభాయించి  చూస్తుంది.
  19. చట్టం యొక్క ముఖ్యమైన లక్షణం జాలి. జాలి లేని దుర్మార్గులు దానిని ఘోరమైన ఆయుధముగా ఉపయోగిస్తున్నారు.
  20.  సంగీతానికి ఒక మైమరపించే శక్తి కలదు. చెడుని మంచి దానిగా చేస్తుంది. మంచి దానిని చెడుగా మారుస్తుంది. 
  21. తప్పు చేసిన మనసును అనుమానం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. 
  22. ఊహలు, భావనలు, అసూయ కలగలిసిన శ్రావ్యగీతాలే వదంతులు. 
  23. తక్కువ కళతో  ఎక్కువ విషయాన్ని చెప్పాలి.    
  24. ఒక పని వంద మాటలతో సమానం. 

    No comments:

    Post a Comment