- విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు. అది అచంచలమైనది, హిమాలయాలంత స్థిరమైనది.
- సాధ్యమని తలిస్తే ఎంతటి పనైనా సులువుగా పూర్తవుతుంది.
- మనం మనకోసం చేసేది మనతోనే అంతరించి పోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి వుంటుంది.
- కష్టపడి పనిచేయని వ్యక్తికీ తిండి తినే హక్కులేదు.
- ముఖం మీద చిరునవ్వు లేకపోతే అందమైన దుస్తులు వేసుకున్నా ముస్తాబు పూర్తికానట్లే.
- దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాలమేడలు,రంగులగోడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి.
- ఒప్పుకున్న తప్పు చీపురులా దుమ్మును చిమ్మి మనసును శుభ్రం చేస్తుంది.
- మన ఆత్మగౌరవాన్ని మనమే కోల్పోవాలి తప్ప దాన్నీ దిగజార్చే శక్తి ఎవరికీ ఉండదు.
- అహింస అంటే బలవత్తరమైన ఆటుపోట్లను సహించేది,అనురాగాన్ని, మమతను పెంచేది.
- నీ అంగీకారం లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు.
- బలహీనుడిలో క్షమాగుణం ఎన్నటికీ కనిపించదు, అది బలవంతుడి లక్షణం.
- జీవితమంటే విశ్రాంతి కాదు, చైతన్యం అందుకే జీవితమంతా ఆచరణ,ఆచరణ,ఆచరణ.
- గురువును మించిన పాఠ్యగ్రంథం లేదని నిరంతరం విశ్వాసిస్తాను.
- విశ్వాసం కొద్ది మాత్రపు తుఫాను తాకిడికి వాలిపోయేది కాదు, విశ్వాసం అనేది అచంచలమైనది,హిమాలయల్లా స్థిరమైనది.
- నిజాయితీతోనే మన జీవితం నిలబడుతుంది, అవినీతికి దిగినప్పుడే మన పతనం ప్రాంభమవుతుంది.
- ఇతరులకి ఉపయోగపడటం,అబద్దాలాడకుండటం, ధర్మాన్ని ఆచరించడం,ఏ ప్రాణికి ద్రోహం చెయ్యకుండా ఉండటం, దయ కలిగి ఉండటం ,సిగ్గు పడవలిసిన పని ఏదీ చెయ్యకుండా ఉండటమే శీలం.
- విధి నిర్వాహణకు మించిన దేశసేవ లేదు.
- మతాలన్నీ గొప్పవే వాటిలో దోషమేమి లేదు, దోషమంతా వాటిని అనుసరించే మనుషుల్లోనే ఉంది.
- నన్ను స్తుతించే వారికంటే నన్ను కఠినంగా విమర్శించే వారి వల్లనే నేను అధికముగా మంచిని పొందియున్నాను.
- మనిషి శీల ప్రవర్తనలను తీర్చిదిద్దలేని విద్య విలువ లేనిది.
- సత్యం,ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పక ఉంటుంది.
- ప్రయత్నం పురుషుని వంతు అయితే ఫలం ఇవ్వడం పురుషోత్తముని వంతు.
- దేవుడు తనకు తోడుగా నున్నాడని భావించే వాడికి ఎన్నటికీ అపజయం ఉండదు.
- శారీరక సామర్థ్యం ద్వారా మనకు బలం రాదు. అణిచి పెట్టలేనంతటి ఆత్మబలం ద్వారానే అది సాధ్యం.
- ప్రేమ బాధల్ని సహిస్తుందే కాని ఎప్పుడూ ప్రతీకారాన్ని తలపెట్టదు.
- రేపే చనిపోతున్నట్లు జీవించు, శాశ్వతంగా బ్రతికి ఉండేలా భావించి నేర్చుకో.
- భయం శారీరకమైన జబ్బు కాకపోవచ్చు.కానీ ఆత్మను చంపేస్తుంది.
- శక్తి శారీరకమైన సామర్థ్యం నుంచి రాదు.మనసులో కోరిక నుంచి వస్తుంది.
- ప్రపంచంలో నేను ఒకేఒక నియంతను అంగీకరిస్తాను.....అంతర్వాణి.
- నా ఇంటి కిటికీలు మూసి ఉండాలని నేనెప్పుడూ కోరుకోను. భిన్నదేశాల సంస్కృతుల పవనాలు వాటి గుండా స్వేచ్చగా ప్రయాణించాలి. అలాగని నా కాళ్లు లాగేస్తానంటే ఒప్పుకోను . ఇతరుల ఇంట్లో బానిసలా, బిచ్చగాడిలా ఉండటాన్ని కూడా అంగీకరించను.
- మానవ సమాజం.......మనస్సు,మత,రాజకీయ,సామాజిక అడ్డుగోడలతో విభజింపకూడదు.
- భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడం కంటే ఈ క్షణాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడమే నాకిష్టం.
- అధికారం రెండు రకాలు,భయపెట్టి సంపాదించేది, ప్రేమతో వచ్చేది. ప్రేమతో వచ్చే అధికారం భయంతో వచ్చేదానికన్నా శక్తివంతమైనది.
- రాళ్లతో కట్టబడే ఆలయం కంటే నరాలు,రక్తమాంసాలతో కట్టబడియున్న మనిషి శరీరమే నిజమైన ఆలయం.
- ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు.
- మతము లేకుండా ఏ మనిషి బ్రతుకలేడు.కొందరు తమ అహంకారము వలన తమకు మతానికి ఏ విధమైన సంబంధం లేదు అని చెప్పుతున్నారు. ఈ విధంగా చెప్పడం నేను శ్వాస వదులుతున్నాను. అయితే నేను శ్వాసించలేదు అని చెప్పే విధంగా వుంటుంది.
- తప్పును ఒప్పుకోకపోవడం కంటె పెద్ద అవమానం వేరే లేదు.
- హృదయం అనేది తెలివి కంటే గొప్పది.మెదడులో తెలివిని చేర్చడం కంటె, హృదయన్ని ఉపయోగించి పెరగడం పైనే దృష్టి సారించండి.
- చెడు వేరు,చెడును చేసేవారు వేరు అనే భావనను ఎల్లప్పుడు మర్చిపోకూడదు.
- మీరు ఏది చెప్పినను మీ మనస్సుకు,ప్రపంచానికి నిజముగానే నడుచుకోండి.
- సమాజం వెంట చేరి మనిషి క్రమశిక్షణతో పని చేయవలెను.
- కంటిచూపు లేనివాడు గ్రుడ్డివాడు కాదు, తన తప్పులను తెలుసుకోకుండా ఉంటున్నాడే వాడే నిజమైన గ్రుడ్డివాడు.
- దేవుడ్ని దర్శించేందుకు నిజము,ప్రేమ,అహింస అనునవి మూడు మార్గములగును.
- కోపమో, పగో లేకుండా కష్టాన్ని ఒకడు భరిస్తే వాడు సూర్యుడికి సమానమవుతాడు...దాని ముందు రాయిలాంటి హృదయమైనా కరుగుతుంది.
- సత్యం ఒక వంక, ప్రపంచాధిపత్యం మరో ప్రక్క ఉంటే ఓ మనసా నువ్వు సత్యాన్నే ఎంచుకో.
- చిత్తశుద్ధితో ఒక పని మీద దృష్టి కేంద్రికరించ గలిగిన మానవుడు చివరకు దేన్నైనా సాధించగల శక్తిని సంపాదిస్తాడు.
- తనను తాను శాసించుకొనలేనివాడు, ఇతరులను శాసించడంలోనూ విజయం పొందలేడు.
- ఇతరులు చెప్పిన దాన్ని ఆచరించడంలోనో, వారిని అనుకరించడంలోనో కాదు. మనం సరైనదని నమ్మిన పని చేయడంలోనే నిజమైన సంతోషం, మనఃశాంతి ఉన్నాయి.
- ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు. హృదయంలో ఉంటుంది.
- ఆత్మ నిగ్రహమున్నవారు, దీక్షగా పనిచేసేవారు మాట్లాడరు.మాటలు,పని ఏకకాలంలో సాగవు, ప్రకృతిని చూడండి. నిర్విరామముగా పనిచేస్తూనే ఉంటుంది నిశ్శబ్దముగా.మన స్వభావాన్ని ఉన్నదానికంటే చాలా మెరుగ్గా ప్రదర్శించాలని తాపత్రయపడతాం.కని మన మానసిక స్థాయి ఎంతలో ఉంటే అంతలోనే కనిపించడం ఎంతో బాగుంటుంది. ఆ స్థాయిని దాటి ఎదగలనుకుంటే మాత్రం ఉన్నతంగా ఆలోచించాలి. అది సాధ్యం కాకపోతే ఉన్నట్లుగానే కనిపించాలి. అంత స్వచ్చంగా ఉన్నపుడే ఏదో ఒక రోజున కోరుకున్న శిఖరాలను అధిరోహించ గలుగుతాము.
- నియమాల్ని పాటించకుండా ఏ పని జరుగదు. గతి నిర్దేశాల్లో ఏకాస్త తేడా వచ్చినా సౌరవ్యవస్థ మొత్తం కుప్ప కూలుతుంది కదా!!!
- ఆదర్శమంటూ లేని మనిషి తెడ్డులేని నావ లాంటివాడు.
- సొంత లోపాన్ని పట్టించుకోకుండా ఇతరులను ఎత్తి చూపడంలోనే మనం ఆనందం పొందుతాం. అందుకే ఇంత ఆశాంతి.
- పైకి కనిపించేదే అశుభ్రం కాదు.తెల్లటి వస్తువు మీద చిన్న మరక పడినా వెంటనే గుర్తిస్తాం. నలుపు మీద చిన్న మరక పడినా వెంటనే గుర్తించం. నలుపు మీద ఎంత మాలిన్యం ఉన్నా కనిపించదు,పట్టించుకోము.
- 'నిజమైన బలం' అన్నది బలశాలి శారీరక శక్తిలో లేదు. కానీ అది మనశ్శక్తిలోనూ,ఆత్మజ్ఞానంలోనూ,మరణ భయం నుంచి విముక్తి పొందడంలోను ఉంటుంది.
- సుగుణం అనేది జీవితపు సౌందర్యం.
- సత్యం శాశ్వతమైనది, సత్యమే పలుకుట వలన మనిషి గౌరవం పెంచుతూ, మానవత్వ విలువలను కాపాడిన వారవుతాము.
- కష్టించి పని చేసేవానికే విశ్రాంతిలోని ఆనందం తెలుస్తుంది.
- మానవమాత్రునికి భగవంతుని గురించి పూర్తిగా వర్ణించడం సాధ్యపడితే నా నిర్ణయం ప్రకారం భగవంతుడనగా సత్యం. కాని తర్వాత మరొక అడుగు ముందుకు వేసి 'సత్యమే భగవంతుడూ అని చెప్పగలను.
- మంచి మనిషి ఆలోచన ఎప్పుడూ వృధా కాదు.
- సత్యం నా జీవితానికి ఊపిరి వంటిది.
- వెలుగు ఎక్కడ ఉంటుందో, నీడ కూడా అక్కడే ఉంటుంది.
- ప్రతి పౌరుడు హక్కులను మాత్రమే కోరుకుంటూ, బాధ్యతలను విస్మరిస్తే అరాజకం తప్పదు.
- జీవితం,మృత్యువు ఒకే నాణానికి రెండు ప్రక్కల వంటివి.
- మన దేశంలో ఏ రంగంలో ప్రగతి సాధించినా దాని ఫలితాలు అందరికీ సమానంగా దక్కాలి. అప్పుడే నేను ఆ ప్రగతిని గుర్తిస్తాను.
- మనం అభ్యుదయాన్ని సృష్టించాలంటే చరిత్రను పునరావృతం చేయడం కాదు. నూతన చరిత్రను సృష్టించగలగాలి.
- సత్కార్యాలు చేసి చూపెట్టు. చేస్తానంటూ ప్రచారం చేసుకుంటూ ఊరికే మురిసిపోకు.
- వెలుగుతున్న దీపం వెయ్యి దీపాలను వెలిగించినట్లే నేర్చుకున్నవాడే ఇతరులకి నేర్పించగలడు.
- ఏ విషయం గురించైనా సరే కేవలం తెలుసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కోరుకున్నది సాదించాలంటే నిరంతరం ప్రయత్నించాల్సిందే.
- ఆశ మానవుణ్ణీ గొప్పవాణ్ణి చేస్తుంది. దురాశ మానవుణ్ణి నీచుణ్ణి చేస్తుంది.
- విద్యను దాచుకోకు దానిని పది మందికీ పంచితే మరింత రాణిస్తుంది.
- గమ్యం లేని నావలాగా ఆదర్శం లేని శ్రమ నిరర్థకం.
- హింసాత్మక పోకడలతో సాధించిన విజయం ఓటమితో సమానం.
- ధైర్యగుణాన్ని మనిషి బాహ్య ప్రపంచంలో ఎక్కడా పొందలేడు. అది మనిషి స్వభావం లోంచే పుడుతుంది.
- సత్యం,అహింస లాంటి విలువైన పాఠాలు మనకి నేర్ప గలిగేది పసివారే.
- ఒక పువ్వు విచ్చుకోగానే ఎంత సువాసన వస్తుందో ఒక మంచి పుస్తకం తెరవగానే అంత విజ్ఞానం కనిపిస్తుంది.
- మనిషి తప్పు చేయడం సహజం, కాని చేసిన తప్పును తెలుసుకొనే మానసిక పరిజ్ఞానం లేకపోవడమే తప్పు, తన తప్పును సరిదిద్దుకొనేవాడే ఉత్తమ పౌరుడు.
- కష్టాలను తప్పించుకొనే వారికంటే వాటిని అధిగామించేవారే విజయం సాధించగలరు.
- సత్యాన్ని మించినా అందం లేదు.
- అందం నడవడికలో వుంటుంది కాని ఆడంబరంలో కాదు.
Thursday, August 19, 2010
Mahathma Gandhi
Subscribe to:
Post Comments (Atom)
chala chala bagunnai thank Q
ReplyDeleteQuotations chala chala bagunnai thank Q!
ReplyDeleteplease provide save as pdf link, Thank Q!
ReplyDeletechaala thanks boss.. net lo chaala vethika ilanti quotes kosam.. aakariki mee blog lo dhorikay... a gr8 job..
ReplyDeleteVery true and good ones. Thanks for posting.
ReplyDeleteమహాత్మా గాంధీజీ సూక్తులను తెలుగు భాషలో అందరికీ అందుబాటులో తీసుకొచ్చిన మీ శ్రమ/కృషీ అభినందనీయం. ధన్యవాదాలు.
ReplyDeleteit s very nice cotations
ReplyDelete