- మేల్కొన్న మనిషి దేనినైనా సాధించగలడు. మేల్కోకుండా నిద్రపోవడం మృత్యుసమానం.
- నిజాయితీ మాటమాత్రంగా కాక,నిజంగా ఉండాలి.అది తనను తాను చీల్చుకొని చర్మాన్ని ఒలుచుకొని చూసుకోవడం లాంటిది.
- అధికులం,సర్వజ్ఞులం,ఉన్నతులం అనుకునే వాళ్ళంతా ఆ వంచనలో దాగిన బోలుతనాన్ని గుర్తించకుండానే బతుకుతున్నారు.
- నిరంతరం వరదలా వచ్చిపడే అసత్యపు విలువలు మరింత దుఃఖాన్ని తెచ్చిపెడతాయి.
- జీవితానికి ఏకాంతం చాలా ఉపయోగపడుతుంది. అయితే ఒంటరిగా జీవించకూడదు.
- వాగుడు అలవాటైతే అది నీ శక్తిని నాశనం చేస్తుంది. నీ లక్ష్యాన్ని చేరనీయకుండా అడ్డుపడుతుంది.వాగడం మానేస్తే ఏం చేయాలో నీకే తెలుస్తుంది.
- నువ్వు దేనినైతే 'నేను' అనుకుంటున్నావో ముందు దాని సంగతి పూర్తిగా తెలుసుకో.
- అది నువ్వు అనుకునే 'నేను' కాదు, నీలో ఇంకా చాలా 'నేను' లున్నాయి.
- మనిషి సహజంగా తన బలహీనతల్ని ఎప్పుడూ ఒప్పుకోడు.వాటిని చూడడు,పట్టించుకోడు,తెలిసినా,తెలిపినా సరిదిద్దుకోడు.
- మనిషి తన నుంచి తాను విడికానంత కాలం, అతడు దేన్నీ చూడలేడు.
- తనని తాను తెలుసుకోవడం చాలా కష్టం. దానికి తీవ్ర సాధన కావాలి.
- జీవితంలో తప్పనిసరిగా ఉండాల్సింది స్వేఛ్ఛ.బాహ్యా విషయ ప్రభావాల నుండి బయటపడి, ఆంతరంగిక స్వభావాల నుంచి విముక్తి పొందనిదే స్వేఛ్ఛ లేదు.
- ప్రతి ఒక్కరూ దేనికో ఒక దానికి ఏదో విధంగా బంధీయే. దాన్నుంచి తప్పించుకునే అవకాశం కోసం తపించడమే సాధన.
- మనలో అహంకారం వంటి ఎన్నో స్వతంత్ర శక్తులున్నాయి. అది సైతానికి ప్రతినిధి,మనిషికి ప్రధాన శత్రువు.
- మార్గం మార్చకు,లక్ష్యం మరువకు, ఎరుకతో ముందుకు సాగు, యాత్ర ప్రారంభించాక అన్వేషిగా మిగిలిపో.
- సాధారణంగా చాలా మందిలో శ్రద్ద అనేది ప్రత్యేకంగా ఉండదు. శ్రద్ద ఉన్ననాడే సత్య సందర్శనం సాధ్యం.
- రోజూ ఓ గంట సేపు నిశ్చలంగా కుర్చో, ఆ కాసేపు మనోమౌనంగా ఉండు. ఆ తర్వాత ఒక తెల్ల కాగితం తీసుకొని నీ లక్ష్యమేమిటో దానిపై రాయి. ఆ లక్ష్యమే నీ గురువు, దైవం, ఆ కాగితాన్ని జేబులో పెట్టుకొని పదే పదే తెరచి చూడు. అది నీకు శక్తిని, సామర్ధ్యాన్ని ఇస్తుంది.
- మనిషి పుట్టినప్పుడు మిల్లులోంచి బైటికి వచ్చిన తెల్ల కాగితం మాదిరిగానే ఏ మచ్చా మరకా లేకుండా శుభ్రంగా ఉంటాడు. పెరిగే కొద్దీ పరిసరాల,పరిస్థితుల ప్రభావం అతనిపై పనిచేస్తాయి. విషయ జ్ఞానం, లోకజ్ఞానం పేరుతో నీతి,దైవం,ధర్మం,జ్ఞానం,మర్యాద,బాధ్యతల పేరుతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,మతం,గురువులు కలిసి ఆ కాగితాన్ని చేయగలిగినంత మురికి చేస్తారు. కాగితమెంత ఎక్కువ మురికిగా ఉంటే అంత గొప్పగా చెలామణవుతుంది.
Tuesday, September 13, 2011
George Gurdjieff
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment