- తనకు తాను గురువు అయిన వ్యక్తి జగద్గురు అవుతాడు.
- స్వీయజ్ఞానం లేకుండా వేరొకరి నుంచి జ్ఞానాన్ని ఆశించడమంటే చీకటి నుంచి చీకటిలోకి ప్రయాణించడమే.
- జీవితం నేటిది. అది అనుభవం కాదు.
- అపార్ధం చేసుకోవడం వల్ల మన మీద మనమే నమ్మకం కోల్పోయి జీవితం మీద,దేవుడి మీద కూడా నమ్మకం కోల్పోతాము.
- అవినీతి ఎల్లప్పుడూ సమాజంలో అంతర్భాగమే.
- అద్దంలో మనల్ని మనం చూసుకున్నంతగా మానసికంగా మనల్ని మనం దర్శించుకోవాలి.
- రాజకీయాలలో కొనసాగుతూ వుండటం కూడా గణించబడుతుంది.
- ప్రకృతి మార్పుకు దూరంగా వుంటే పాతభావనలను నువ్వు కొనసాగిస్తున్నట్లే.
- ఇతరుల ఆలోచనల మీద జీవించడమనేది ప్రమాదకర విషయం.
- సంతోషానికి మార్గాల జాబితా తయారు చేసుకోవడం సులవ్హం. అదే బాధలకు అతికష్టం.
- నువ్వు ప్రేమించిన దానిని నువ్వు ద్వంసం చెయ్యడం చాలా తేలిక.
- దుఖాన్ని అర్ధం చేసుకోవాలిగాని దాని దారిన దాన్ని వదిలెయ్యరాదు.
- ధ్యానం జీవితంలో ఓ గొప్ప కార్యక్రమం. దానికి గొప్ప లోతైన ప్రాముఖ్యత వుంది.
- ధ్యానం లక్ష్యానికి మార్గం కాదు. అదే మార్గం అదే లక్ష్యం.
- ఒకే నమ్మకాని పడే పడే ఉదహరించడం భయానికి తార్కాణం.
- సరైన నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు ఉద్భవిస్తాయి. నీ నిర్ణయమే సమస్య అవుతుంది.
- మానసిక నిస్సబ్ధత నిజమైన మతపరమైన మానసిక నిశ్శబ్దం. దేవుడి నిశ్శబ్దం భూమియొక్క నిశ్శబ్దం.
- పవిత్ర గ్రంథాలు నువ్వు ఏమి చెయ్యాలో,ఏమి చెయ్యకూడదో చెప్తాయి.
- నేటి యువత స్వేచ్చంటే తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిన్చావచ్చని పోలీస్ ముఖం మీద వుయోచ్చని భావిస్తుంది.
- ప్రతిదీ మర్చిపోయేదే 'ప్రేమతో సహా'.
- ప్రేమించేది తెలికనేది మన ఊహ మాత్రమే.
- భాంధవ్యమే జీవితం.భాంధవ్యం ఎల్లప్పుడూ చలనశీలం, ఎప్పుడు మారుతుంది.
- పుర్వంలాగా మనుషుల్ని తయారుచేసే మానవుల అవసరం నేటి ప్రపంచానికి లేదని ఎక్కువమంది నేడు భావిస్తున్నారు.
- అవిశ్రాంతంగా పని చేసే యంత్రం మెదడు.నా పని పూర్తయిందని ఎప్పుడు చెప్పదు.
- జనాలతో కలిసి వుండటం,భావనలతో,విధానాలతో ఏకిభవించడానికి కారణం అందులో రక్షణ ఉండటమే.
- నీ శరీరం సున్నితమైనది కాకుండా శుభ్రమైన మనస్సు ఉండదు.
- ఏది శాశ్వతం కాదని గ్రహించి స్వేచ్చగా జీవించడమే ఆనందం.
- మన వివేకం ఎక్కువ భాగం సంతోసహం పొందడానికి,దాన్ని అనుభవించడానికే.
- సమాజ నిర్మాణం సంతోషదాయకం.
- మన విలువలు మన బాధ్యతల కలగలుపే మన సంస్కృతి.
- నీకది వ్యతిరేకమైనా సరే సత్యాన్ని కోరుకో.
- సత్యం ఒక భావన కాదు. ఓ నిశ్చయమైన ముగింపు.
- అనుభవం సత్యానికి కొలబద్దకాదు.
- సమస్యను మనం నిజంగా అర్ధం చేసుకుంటే ఆ సమస్యలోనే పరిష్కారం దొరుకుతుంది.
- సరళంగా వుండటం నిజాయితీగా ఉండటం ఎన్నటికి బాంధవ్యాలు కావు.
- నీ మనస్సు స్పష్టంగా అవగాహనకు రాకుంటే కష్టాలు ఎదురౌతాయి. అవగాహన అసలు సమస్య.
- సంప్రదాయం పూజానీయమే కావచ్చు. కాని అదొక్కటే అనుసరించదగ్గది కాదు.
- సుగుణం హృదయానికి సంబంధించినది. మనసుకు కాదు.
- మనం మేదోపరంగాను,మానసికంగాను యంత్రాలుగా మారాం. యంత్రానికి స్వేచ్ఛ ఎక్కడిది.
Thursday, August 19, 2010
Jiddu Krishnamurthy
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment