- ఒక నటి యంత్రం కాదు, కాని వారు నిన్ను ఒక యంత్రంగా భావిస్తున్నారు. ఒక డబ్బు యంత్రంగా
- నేను మంచిదాన్ని కాని దేవతను కాను, నేను పాపం చేశాను కాని దయ్యాన్ని కాను,నేను ఆకర్షణీయముగా ఉంటాను,కాని అందమైనదాన్ని కాను, నేను స్నేహితులను కలిగి యున్నాను, కాని నేనేమీ శాంతిని కలిగించుదానిని కాను, ఒక పెద్ద ప్రపంచంలో ప్రేమించేందుకు ఎవరినైనా కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న ఒక చిన్న అమ్మాయిని.
- నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను నేను పునరిద్ధరించుకుంటాను.
- శరీరమున్నది చూసేందుకే, అన్ని మూసి ఉంచేందుకు కాదు.
- మనుషులు తప్ప ,కుక్కలు నన్ను ఎప్పుడు కరువలేదు.
Friday, August 30, 2013
Marilyn Monroe
Arbaaz Khan
- మన పొరుగు దేశాల వారితో మనం కలిసిమెలిసి ఉండాలి. ఎలాంటి గొడవలూ లేకుండా ప్రశాంతంగా స్నేహాన్ని సాగించాలి. ఏ దేశానికైనా అదే నిజమైన అభివృద్ధి!
- చాలామంది గొప్పవాళ్లను వాళ్లు వృద్ధాప్యంలోకి అడుగిడాకో, చని పోయాకో మనం గుర్తిస్తూ ఉంటాం. కానీ అదృష్టంకొద్దీ రెహమాన్‌ని త్వరగానే గుర్తించాం. తన సంగీతంతో భారతదేశానికి ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు రెహమాన్. అతడు భారతీయుడు కావడం మనకు గర్వకారణం!
- నువ్వు గెలిస్తే కొందరు సంతోషిస్తారు. నువ్వు ఓడిపోతే కొందరు సంతోషిస్తారు. ఈ రెండు రకాల వారిలో ఎవరిని సంతోషపెడతావో నువ్వే డిసైడ్ చేసుకోవాలి!
- టైస్టులకు ఈ నాగరిక సమాజంలో బతికే అర్హత లేదు. వాళ్లు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. అమాయకుల్ని పొట్టన బెట్టుకుంటున్నారు. ఒక అమాయకుణ్ని చంపడమంటే మానవత్వాన్నే చంపడం!
- ‘అవకాశం’ అనే మాట వెనుక ఓ మిస్టరీ ఉంది. అదేమిటంటే... మన దగ్గరకు వచ్చినప్పుడు అది మనకు అంతగా అవసరం లేనిదనిపిస్తుంది. కానీ చేజారిపోయాకే... దాని ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది!
Sekhar Kapoor

- నిన్న మొన్నటివరకు గడాఫీని పొగిడిన వివిధ దేశాధినేతలు ఇప్పుడు అతని చావును స్వాగతిస్తున్నారు. గడాఫీని క్రూర నియంతగా పోలుస్తున్న ఐరోపా దేశాధినేతలు దశాబ్దాలుగా ఎక్కడున్నారు? చమురు రాజకీయాల్లో నైతిక విలువలుకు స్థానమెక్కడ?
- ఒక వ్యక్తి పదవిలో ఎక్కువ కాలం ఉంటే, ‘నాకు పరిపాలించే హక్కు ఉంది’ అని తనకు తనే అనుకోవడం మొదలుపెడతాడు. అది మానవ స్వభావం!
- మనం గాంధీజీని మహాత్ముడంటూ పూజిస్తాం. కాని ఆయన చెప్పిన మంచిని మన జీవితాల నుంచి వేరు చేస్తున్నాం. మనం ఆయనను నిలుపుకోవాల్సింది మన మనసుల్లో... గోడకున్న పటాల్లో కాదు!
- మన దేశంలో మేధావులు అనుకుంటున్న కొందరు మాట్లాడుతున్న మాటలు కేవలం మాటలు మాత్రమే. వాటి కంటే ఆకలేసినప్పుడు ఓ జంతువు అరిచే అరుపులకు ఎక్కువ అర్థం ఉంటుంది!
- ఏ కళ అయినా సమాజం యొక్క మనస్సాక్షిని ప్రతిబింబించాలి. సినిమా కూడా ఒక కళే. మరి నేటి సినిమాలు ఆ పని చేస్తున్నాయా?
Katrina Kaif
- ప్రపంచంలోని ఏ మనిషైనా సంతోషాన్ని కోరుకుంటాడు తప్ప, దుఃఖాన్ని కోరుకోడు. అయితే, వర్షపు చినుకు లేకుండా ఇంద్రధనుస్సు రానట్టే, కష్టాలు పడకుండా సంతోషం ఎప్పుడూ దొరకదు!
- నీ సమస్యను బయటికి చెప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే కొంతమంది మాత్రమే నీ పట్ల సానుభూతి చూపించి, సాయం చేస్తారు. మిగతావారంతా నువ్వు చెప్పేదాన్ని చిలువలు పలువలు చేసి పుకార్లుగా ప్రచారం చేస్తారు!
- కన్నీరు చాలా విలువైనది. ఎందుకంటే... కన్నీటి బిందువులో కేవలం ఒక్క శాతం మాత్రమే నీరు ఉంటుంది. మిగతా తొంభై తొమ్మిది శాతం ఫీలింగ్సే!
- మనిషి జీవితం విచిత్రమైనది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు. మధ్యవయసులో అయితే డబ్బు, శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉన్నా కష్టపడే శక్తి ఉండదు.
- మనుషులు మారిపోతారు. ఫీలింగ్స్ తగ్గిపోతాయి. హృదయం ముక్కలైపోతుంది. స్నేహితులు విడిచిపెట్టి పోతారు. కావలసినవాళ్లు శత్రువులుగా మారిపోతారు. ప్రేమికులు పరాయివాళ్లు అయిపోతారు. ఇన్ని జరిగినా... జీవితం మాత్రం సాగిపోతూనే ఉంటుంది!
- నిజమైన ప్రేమ అంటే... ఒకరి కోసం ఒకరు చనిపోయిన రోమియో జూలియెట్‌లది కాదు. ఒకరి కోసం ఒకరు బతికిన మన అమ్మమ్మ తాతయ్యదీ, నాన్నమ్మ తాతయ్యదీను!
- ఒక మనిషి నిన్ను ద్వేషించడానికి ఈ మూడింటిలో ఏదో ఒక కారణం తప్పక ఉంటుంది... నీలాగా ఉండాలని అనుకోవటం, తనను తాను అసహ్యించుకోవటం, వాళ్లకు మనవల్ల ముప్పు ఉందని అనిపించడం!
-సేకరణ: అనూష
Subscribe to:
Posts (Atom)