Friday, August 30, 2013

Arbaaz Khan

  1. మన పొరుగు దేశాల వారితో మనం కలిసిమెలిసి ఉండాలి. ఎలాంటి గొడవలూ లేకుండా ప్రశాంతంగా స్నేహాన్ని సాగించాలి. ఏ దేశానికైనా అదే నిజమైన అభివృద్ధి!
  2. చాలామంది గొప్పవాళ్లను వాళ్లు వృద్ధాప్యంలోకి అడుగిడాకో, చని పోయాకో మనం గుర్తిస్తూ ఉంటాం. కానీ అదృష్టంకొద్దీ రెహమాన్‌ని త్వరగానే గుర్తించాం. తన సంగీతంతో భారతదేశానికి ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు రెహమాన్. అతడు భారతీయుడు కావడం మనకు గర్వకారణం!
  3. నువ్వు గెలిస్తే కొందరు సంతోషిస్తారు. నువ్వు ఓడిపోతే కొందరు సంతోషిస్తారు. ఈ రెండు రకాల వారిలో ఎవరిని సంతోషపెడతావో నువ్వే డిసైడ్ చేసుకోవాలి!
  4. టైస్టులకు ఈ నాగరిక సమాజంలో బతికే అర్హత లేదు. వాళ్లు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. అమాయకుల్ని పొట్టన బెట్టుకుంటున్నారు. ఒక అమాయకుణ్ని చంపడమంటే మానవత్వాన్నే చంపడం! 
  5.  ‘అవకాశం’ అనే మాట వెనుక ఓ మిస్టరీ ఉంది. అదేమిటంటే... మన దగ్గరకు వచ్చినప్పుడు అది మనకు అంతగా అవసరం లేనిదనిపిస్తుంది. కానీ చేజారిపోయాకే... దాని ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది!