
- నిన్న మొన్నటివరకు గడాఫీని పొగిడిన వివిధ దేశాధినేతలు ఇప్పుడు అతని చావును స్వాగతిస్తున్నారు. గడాఫీని క్రూర నియంతగా పోలుస్తున్న ఐరోపా దేశాధినేతలు దశాబ్దాలుగా ఎక్కడున్నారు? చమురు రాజకీయాల్లో నైతిక విలువలుకు స్థానమెక్కడ?
- ఒక వ్యక్తి పదవిలో ఎక్కువ కాలం ఉంటే, ‘నాకు పరిపాలించే హక్కు ఉంది’ అని తనకు తనే అనుకోవడం మొదలుపెడతాడు. అది మానవ స్వభావం!
- మనం గాంధీజీని మహాత్ముడంటూ పూజిస్తాం. కాని ఆయన చెప్పిన మంచిని మన జీవితాల నుంచి వేరు చేస్తున్నాం. మనం ఆయనను నిలుపుకోవాల్సింది మన మనసుల్లో... గోడకున్న పటాల్లో కాదు!
- మన దేశంలో మేధావులు అనుకుంటున్న కొందరు మాట్లాడుతున్న మాటలు కేవలం మాటలు మాత్రమే. వాటి కంటే ఆకలేసినప్పుడు ఓ జంతువు అరిచే అరుపులకు ఎక్కువ అర్థం ఉంటుంది!
- ఏ కళ అయినా సమాజం యొక్క మనస్సాక్షిని ప్రతిబింబించాలి. సినిమా కూడా ఒక కళే. మరి నేటి సినిమాలు ఆ పని చేస్తున్నాయా?