Friday, August 30, 2013

Katrina Kaif

  1. ప్రపంచంలోని ఏ మనిషైనా సంతోషాన్ని కోరుకుంటాడు తప్ప, దుఃఖాన్ని కోరుకోడు. అయితే, వర్షపు చినుకు లేకుండా ఇంద్రధనుస్సు రానట్టే, కష్టాలు పడకుండా సంతోషం ఎప్పుడూ దొరకదు!
  2. నీ సమస్యను బయటికి చెప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే కొంతమంది మాత్రమే నీ పట్ల సానుభూతి చూపించి, సాయం చేస్తారు. మిగతావారంతా నువ్వు చెప్పేదాన్ని చిలువలు పలువలు చేసి పుకార్లుగా ప్రచారం చేస్తారు!
  3. కన్నీరు చాలా విలువైనది. ఎందుకంటే... కన్నీటి బిందువులో కేవలం ఒక్క శాతం మాత్రమే నీరు ఉంటుంది. మిగతా తొంభై తొమ్మిది శాతం ఫీలింగ్సే!
  4. మనిషి జీవితం విచిత్రమైనది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు. మధ్యవయసులో అయితే డబ్బు, శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉన్నా కష్టపడే శక్తి ఉండదు.
  5. మనుషులు మారిపోతారు. ఫీలింగ్స్ తగ్గిపోతాయి. హృదయం ముక్కలైపోతుంది. స్నేహితులు విడిచిపెట్టి పోతారు. కావలసినవాళ్లు శత్రువులుగా మారిపోతారు. ప్రేమికులు పరాయివాళ్లు అయిపోతారు. ఇన్ని జరిగినా... జీవితం మాత్రం సాగిపోతూనే ఉంటుంది!
  6. నిజమైన ప్రేమ అంటే... ఒకరి కోసం ఒకరు చనిపోయిన రోమియో జూలియెట్‌లది కాదు. ఒకరి కోసం ఒకరు బతికిన మన అమ్మమ్మ తాతయ్యదీ, నాన్నమ్మ తాతయ్యదీను!
  7. ఒక మనిషి నిన్ను ద్వేషించడానికి ఈ మూడింటిలో ఏదో ఒక కారణం తప్పక ఉంటుంది... నీలాగా ఉండాలని అనుకోవటం, తనను తాను అసహ్యించుకోవటం, వాళ్లకు మనవల్ల ముప్పు ఉందని అనిపించడం!

    -సేకరణ: అనూష