Thursday, June 28, 2012

Surya (Actor)
















  1. జీవితం చాలా విలువైనది. మన నమ్మకం ఆ విలువను పెంచుతుంది.
  2. జీవితంలో మనం వేసే ప్రతి అడుగూ ఓ కొత్త అధ్యాయం. అది ఓ సరికొత్త ప్రయాణం కోసం ఎదురుచూస్తుంటుంది.
  3. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అదృష్టం కలిసొస్తుంది.
  4. ప్రతి స్నేహితుడూ మనలో మనకే తెలియని కొత్త ప్రపంచాన్ని చూపిస్తాడు. అతడు కలిసే వరకు అది మనకు తెలియదు. 
  5. వాస్తవికమైన కలలను నటనలో ప్రతిబింబించే వాడే నిజమైన కళాకారుడు. 
  6. ప్రపంచంలోని వేల భాషలకు దీటైనది చిరునవ్వే. ఎందుకంటే అది పసికందు కూడా మాట్లాడగలిగిన భాష.
  7. సాటి మనుషులపై నీకు గౌరవం ఉంటే, వారి జీవితం మెరుగుపడటానికి కచ్చితంగా నీవు సాయపడగలవు.
  8. ఆరోగ్యమనేది గొప్ప బహుమతి. సంతృప్తి అనేది గొప్ప సంపద. నమ్మకం ఓ గొప్ప బంధం.
    మన ఊహా శక్తి అసలు ఉనికే లేని ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఊహ లేనిదే మనకు గమ్యమే లేదు.
  9. కలలనేవి... రేపటి ప్రశ్నలకు నేటి సమాధానాలు. 
  10. ఇప్పటికే ప్రారంభించిన పనికి మరో ఆరంభం ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే, సరికొత్త ముగింపు ఇవ్వడానికి మాత్రం వర్తమానం అవకాశం కల్పిస్తుంది.

    సేకరణ: అనూష(సాక్షి పత్రిక)

No comments:

Post a Comment