Thursday, June 28, 2012

Mahesh Bhatt
















  1. మన ఉనికి ప్రేమను బలపరుస్తుంది. మన ఎడబాటు దానికి మరింత పదును పెడుతుంది.
  2. ఒక చిన్న బిడ్డ కంటినుంచి జాలువారే కన్నీటి చుక్కను చూస్తే బాధంటే ఏంటో తెలుస్తుంది. అసలైన జీవితాన్ని నిజ జీవితంలోనే చూడగలం, సినిమాల్లో కాదు.
  3. మెదడుకీ సముద్రానికీ ఒక ఉమ్మడి పోలిక ఉంది. ఆ రెండూ నిరంతరం అలజడిని కలిగిస్తూనే ఉంటాయి.
  4. ప్రతిభ ఉన్నవారికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే దాన్ని అందించడానికి కాస్త సమయం పడుతుంది.
  5. అయిదు కప్పలు వరుసగా కూర్చుని ఉన్నాయి. నాలుగు దూకేయాలని నిర్ణయించుకున్నాయి. ఇంకా ఎన్ని కప్పలు మిగులుతాయి? జవాబు... 5. ఎందుకంటే నిర్ణయించుకోవడం వేరు, ఆచరించడం వేరు.
  6. చీకట్లో అడుగువేయడానికి ఎప్పుడూ భయపడొద్దు. అలాగే సుగమమైన మార్గం కోసం కూడా అన్వేషించవద్దు. నీకు కనిపించిన దారిలో నీ మనసు మాట వింటూ వెళ్లిపోవడమే!
  7. మనం బాధపడే దానికంటే భయపడేదే ఎక్కువ. ఎందుకంటే వాస్తవాల కన్నా ఊహలే మనకి ఎక్కువ వ్యధ కలిగిస్తాయి.
  8. ఓ పద్దెనిమిదేళ్ల కుర్రాడికి ఓ మనిషిని షూట్ చేసి చంపడమెలాగో కొన్ని వారాల్లో నేర్పేస్తున్నారు. కాని ఒక మనిషి ప్రాణాన్ని కాపాడటం ఎలాగో నేర్పాలంటే మాత్రం కొన్నేళ్లు పడుతుంది.

No comments:

Post a Comment