Thursday, June 28, 2012

Aravind Kejriwal
















  1. ప్రస్తుతం పార్లమెంటులో ఉన్నవారిలో 162 మంది ఏదో ఒక నేర చరిత్ర కలిగి ఉన్నవారు. ఆ ఉన్నత స్థానాన్ని శుభ్రపరచాల్సి ఉంది. 
  2. మన రాజ్యాంగాన్ని మూడేళ్లలోనే రూపొందించారు. కానీ అవినీతిపరుల భరతం పట్టే లోక్‌పాల్‌ను రూపొందించడం 44 ఏళ్లైనా సాధ్యపడటం లేదు!
  3. ప్రస్తుతం భారతదేశం ‘హై కమాండ్’ అనే నియంతృత్వ వ్యవస్థ కబంధ హస్తాల్లో నలిగిపోతోంది. ప్రజలను దాని చెర నుంచి విముక్తి చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
  4. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులు తమపై తామే విచారణ జరిపించుకొంటారా? వారి విషయంలో కూడా లోక్‌పాల్ ద్వారా ఒక పటిష్టమైన వ్యవస్థ ఏర్పడుతుంది. లేకపోతే లోక్‌పాల్ ఒక పోస్టాఫీసులా మిగిలిపోతుంది. 
  5. మహాత్ముడి రక్తంతో తడిసిన మట్టిని కూడా వేలానికి పెట్టారు. ఎంతో పవిత్రమైనదాన్ని వేలానికి రాకుండా ఆపాల్సిన మన ప్రభుత్వం, కనీసం ఆ వేలంలో కొనే ప్రయత్నం కూడా చేయకపోవడం సిగ్గుచేటు!
  6. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు తీవ్రమైన ఎదురుగాలి వీస్తోంది. దీన్ని ఎదుర్కొని నిలవడం దానికి అత్యంత కష్టమైన పని. ఇకనైనా ఆ పార్టీ... ప్రజల నమ్మకాలతో ఆడుకోవడం ఆపితే మంచిది. 


    -సేకరణ: జీవన్(సాక్షి పత్రిక)


No comments:

Post a Comment