Thursday, June 28, 2012

Kiran Bedi
















  1. మనమంతా అమ్మ ఒడితో మొదలుపెట్టి తరగతి గది వరకు సత్యం గురించిన పాఠాలు నేర్చుకోకపోయినట్లైతే ఈ రోజు మనది పూర్తిగా ధృతరాష్ట్రుల దేశం అయివుండేది.
  2.  అన్నా హజారే ఏదీ తనకోసం అడగటం లేదు, దేశంలోని ప్రజలకోసం అడుగుతున్నారు. ఆయన దేశద్రోహి కాదు, దేశభక్తుడు. ఈ విషయాన్ని మన ప్రధానికి వివరించడానికి ఓ విదురుడు కావాలేమో!
  3. ఇప్పుడు మన దేశంలో పోలీస్‌స్టేషన్లు రాజకీయ నాయకుల అధీనంలో ఉన్నాయి. సీబీఐ అధికార పార్టీ చెప్పినట్టు వింటోంది. ఈ పరిస్థితిని మనం మార్చలేమా? 
  4. సృజనాత్మకత అంటే వైవిధ్యంగా చేయడం కాదు. చేసే పనిలో వైవిధ్యం చూపించడం!
    చట్టాలను పటిష్టంగా అమలు చేసే వ్యవస్థలు బలంగా లేకపోతే అవినీతిని అడ్డుకోవడం అసాధ్యం.
  5. నేతలు, అధికారులు సమాజాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దినపత్రికలు క్షుణ్ణంగా చదవడంతో పాటు చర్చలను పరిశీలించాలి, సోషల్ నెట్‌వర్క్‌లో కలిసిపోవాలి, యువతను గమనించాలి. ఇవన్నీ సమాజ పరిస్థితులను తెలిపేవే. 
  6. భారతీయులారా అవినీతి నిరోధానికి ఇది అత్యంత కీలక సమయం. ఉన్నత హోదాల్లో ఉన్న అవినీతి శక్తులు ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయి. ఇప్పటికైనా మేలుకోండి, అవినీతిపై ఉద్యమించండి.
  7. మనం ఓటమికి సిద్ధంగా లేనంతవరకు మనల్ని ఓడించడం ఎవరి తరం కాదు, సీబీఐకి స్వతంత్ర హోదా వచ్చే వరకు విశ్రమించొద్దు.

No comments:

Post a Comment