Monday, June 25, 2012

Lata Mangeshkar
















  1. నా అనుభవం తెలియజేసిందేమిటంటే...ఎదుటివాళ్లు మనం చెప్పిన విషయాన్ని మర్చిపోతారు.మనం వాళ్లకు చేసిన పనులను మర్చిపోతారు.కానీ మనం వారికి పంచిన అనుభూతుల్ని మాత్రం ఎప్పటికి మర్చిపోలేరు.
  2. ఏ పనినైన చేయడానికి మనం భయపడుతున్నామంటే..అది కష్టమైనది కావడం వల్ల కాదు.మనం భయపడుతున్నందు వల్లే అది కష్టంగా అనిపిస్తుందని తెలియకపోవడం వల్ల.
  3. నువ్వు కన్న కల పగిలి వంద ముక్కలై పోయిందనుకో. వాటిలోని ఒక్క ముక్కను తీసుకోవడానికి వెనుకాడవద్దు. ఎందుకంటే మరో కొత్త ఆరంభానికి అదే నీకు ఆధారం.
  4. ప్రతి ఒక్కరి జీవితాలలోనూ సంతోషభరిత క్షణాలుంటాయి.దుఃఖపూరిత ఘడియలు ఉంటాయి. అయితే నువ్వు వేటిని గుర్తుంచుకున్నావన్నదానిమీదే నీ సంతోషం ఆధారపడి ఉంటుంది.
  5.  తోటలోవున్న పువ్వుల్ని బట్టి తోటను అంచనా వెయ్యాలి తప్ప..రాలిపడిన ఆకుల్ని బట్టి కాదు. మన జీవితాల్ని అంచనా వేయాల్సింది నవ్వులతో తప్ప రాల్చిన కన్నీటి చుక్కలతో కాదు.
  6. నీ డబ్బును బట్టో, నీ స్థాయిని బట్టో ఎప్పుడు గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు,బంటూ చేరేది ఒక పెట్టెలోకే.
  7. ఏ మనిషి జీవితంలోనైనా రెండు గొప్ప రోజులు ఉంటాయి. ఒకటి అతడు పుట్టినరోజు. రెండోది... అతడు ఎందుకు పుట్టాడో తెలుసుకున్న రోజు!
  8. అబద్ధానికి వేగమెక్కువ. నిజానికి ఓపికెక్కువ!
  9. నువ్వు నడుస్తున్న దారి ఎటు తీసుకెళ్తే అటు వెళ్లిపోవద్దు. నువ్వు కోరుకున్నదాన్ని సాధించడానికి అవసరమైన దారిని వెతుక్కుంటూ వెళ్లు!
  10. తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు!

No comments:

Post a Comment