Thursday, June 28, 2012

Javed Akhtar
















  1. నేను భారతీయుడిని. ఎటువంటి మతవాదమైనా నాకు నచ్చదు. హిందూ, ముస్లిం మతాల సంప్ర దాయ వాదులు నాపై విరుచుకు పడుతుంటారు. వారి బెదిరింపులకు నేను భయపడను. 
  2. గత 20 ఏళ్లుగా ముద్రిస్తున్న డిక్షనరీల్లో ఒక పదం గురించి ఎటువంటి వివరణ లేకుండా ముద్రిస్తున్నారను కొంటా. నేటి తరానికి పరిచయం లేని ఆ పదమే ‘డిగ్నిటీ’!
  3. ఇంతకీ అన్నా హజారే కోరుకుంటోంది ఏమిటి? ప్రభుత్వం ఇస్తానంటున్నది ఆయనకు అవసరం లేదా లేక ఆయన అడిగింది ప్రభుత్వం ఇవ్వట్లేదా! 
  4. నేను ముస్లిముల ఆచార వ్యవహారాలను తప్పుపడితే కొంతమంది మూఢులు నాపై ఫత్వాలు జారీ చేస్తారు. 
    చంపేస్తామంటారు. అదే హిందువులను విమర్శిస్తే నన్నే మూఢుడు అని అంటారు. ఇది కొంచెం బెటరేమో!
  5. నేను పక్షపాతంతో మాట్లాడతాను, కొన్ని విషయాల్లో నోరు తెరవను అనేవాళ్లు చెవిటివాళ్లు అని నా అభిప్రాయం. ప్రతి అనాగరికమైన అంశానికి వ్యతిరేకంగా కూడా నేను ఎలుగెత్తుతుంటా!
  6. నా అభిప్రాయాలతో విబేధించేవారు చాలామంది ఉండొచ్చు, దానికోసం వారు మొరటుగా మాట్లా డితే నేను కూడా అలాగే మాట్లాడుతా. అభిప్రా యాలను వ్యక్త పరిచే స్వేచ్ఛ అందరికీ ఉంది.

    సేకరణ: జీవన్(సాక్షి పత్రిక)

No comments:

Post a Comment