Sunday, November 25, 2012

Sruthi Hasan


  1. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే... అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేం.
  2. ప్రతి ఒక్కరూ ఎదుటివారిని తప్పుబడుతూ ఉంటారు. అలా చేయటం మంచిది కాదు. గాజు భవంతిలో నివసించేవాడు ఎదుటివాడి మీద రాళ్లు వేయడం ఎంత తప్పో వాళ్లంతా తెలుసుకుంటే మంచిది.
  3. నేను మొన్నొక దృశ్యం చూశాను. బస్టాప్‌లో బస్సు వచ్చి ఆగగానే అందరూ తోసుకుంటూ ఎక్కేస్తున్నారు తప్ప, పక్కన వీల్‌చెయిర్‌లో ఉన్న వ్యక్తిని ఎక్కించడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు. తామే మొదట ఎక్కాలని అందరికీ తాపత్రయం. ఇంకెక్కడుంది మానవత్వం!
  4. అవతలివారు నీ గురించి ఏమనుకుంటున్నారో అని మాత్రమే ఆలోచిస్తూ కూర్చుంటే, నీ గురించి నువ్వు ఆలోచించుకోవడమే మర్చిపోతావ్. ఇది నీ జీవితం. నీకు నచ్చినట్టు జీవించు. జీవితం ఉన్నది జీవించడానికే కదా!
  5. కొన్నిసార్లు కొన్నిటిని వదిలిపెట్టడం కష్టమనిపిస్తుంది. కానీ వాటిని ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకోవాలని చూడటం వల్ల... నువ్వు జీవితంలో ఇంకేమీ చేయడానికి వీల్లేకుండా అవి నీ చేతుల్ని కట్టిపారేస్తాయి. కాబట్టి కాస్త బాధగా ఉన్నా, కొన్నిటిని వదులుకోవడమే మంచిది!


-సేకరణ: అనూష (సాక్షి)

3 comments: