Sunday, November 25, 2012

Barack Obama


  1.  నా మనసెప్పుడూ అభివృద్ధి గురించే ఆలోచిస్తోంది. దేశాన్ని ముందుకు నడిపించడానికి నేను ఏ పార్టీతోనైనా, ఏ వ్యక్తితోనైనా కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను!
  2. రేపటిని నిర్మించుకోవాలనుకున్నప్పుడు నాయకత్వం కోసం పోటీ పడుతున్న ఇద్దరు వ్యక్తులనో, రెండు పార్టీలనో దృష్టిలో పెట్టుకోకూడదు. ఆ ఇద్దరి దృక్పథాలనూ మనసులో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి!
  3. సమాజంలో రావాల్సిన మార్పేమిటో మనకు తెలుసు. ఆ మార్పుకోసం మనం ఏం చేయాలో కూడా మనకు తెలుసు. అది చేయడం అంత తేలిక కాదని కూడా తెలుసు. అయితే అందరూ చేతులు కలిపితే తప్పక సాధించగలం!
  4. నువ్వొక్కడివీ ఓటు వేయకపోతే వచ్చే నష్టమేమీ ఉండదని అనుకోవద్దు. నీ స్వరం వినిపించినా పెద్దగా ఉపయోగం ఉండదని ఎవరైనా అంటే నమ్మవద్దు. నీ ఒక్కడి ఓటూ చరిత్రను మార్చగలదు. నీ స్వరం కొన్నిలక్షల మంది ఆలోచనల్ని ప్రభావితం చేయగలదు!
  5. చక్కని ఆరోగ్యం, మంచి ఉద్యోగం చేయడం వంటివి వ్యక్తిగత విషయాలు కాదు. ఓ దేశం ఎంత అభివృద్ధి చెందిందో చెప్పడానికి అవి నిదర్శనాలు!

No comments:

Post a Comment