Thursday, August 30, 2012

Meher Baba













  1. వ్యాకుల పడకండి  ఆనందంగా ఉండండి.
  2. నన్ను ప్రేమించండి నేను మీకు సహాయం చేస్తాను..
  3. నీ బాధ్యతల నుండి తప్పించుకోవద్దు.
  4. నీ ప్రాపంచిక విధులను విశ్వాసంతో నిర్వర్తించు కాని,ఇదంతా బాబాదేనని నీ మనసులోని అంతరాలలో నిరంతరం జ్ఞప్తి ఉంచుకో.
  5. ఏ పరిస్థితినైనా స్వీకరించి,"బాబా నన్నీ పరిస్థితిలో ఉంచా"రని నిజాయితితోనూ,చిత్తశుద్దితోను భావించు.   
  6.  ఇతరులను ఆనందింప చేయడంలోనే నిజమైన ఆనందం ఉంది.
  7. నేను మీ హృదయములలో ప్రేమ బీజములు నాటుటకు వచ్చాను.
  8. నేను బోధించుటకు రాలెదు.మేల్కొల్పుటకే వచ్చను.
  9. బాబా ప్రతి ఒక్కరిలోనూ ఉన్నారనే అవగాహనతో, ఇతరులను సేవించడానికీ,సహాయపడడానికీ ప్రయత్నించు..
  10. ఇతరులలోని లోపాలను చూడడానికి బదులు ,మనకు మనం ఆత్మావలోకనం చేసుకోగలిగినట్లయితే,మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే.
  11. మనకు సహాయం చేసుకోవడానికై ఇతరులను దోచుకోవడానికి బదులు, ఇతరులకు సహాయం చేయాడనికై మనలను మనం దోచుకోగలిగితే,మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే..
  12. ఇతరుల బాధలలో మనం బాధ ననుభవించి,ఇతరుల ఆనందంలో మనం ఆనందాన్ని అనుభవించగలిగితే,మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే..
  13. మన దురదృష్టాల గురించి వ్యాకుల పడడానికి బదులు, చాలా చాలా మంది ఇతరులకంటే మనం చాలా అదృష్టవంతులమని భావించుకోగలిగితే, మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే.
  14. మనకు సంప్రాప్తమైన దానిని భగవదీచ్చగా అంగీకరించి,దానిని ఓరిమితోనూ,తృప్తితోనూ స్వీకరించి నట్లితే,మనం భగంతుని ప్రేమిస్తున్నట్లే. 
  15. భగవంతుని జీవరాశులెవ్వరికి కష్టం కాని,అపకారం కాని కలిగించకుండా ఉండడమే భగవంతునికి అర్పించగల ఆత్యున్నతమైన భక్తి,ఆరాధన అని అవగాహన చేసుకొని,ఆ విధంగా భావించగలిగితే,మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే.
  16. భగవంతుని ప్రేమించవలసిన విధంగా ప్రేమించడానికి గాను,జీవిత గమ్యం భగవంతుని ప్రేమిస్తూ,ఆయనను స్వీయ ఆత్మగా కనుగొనడమేనని తెలుసుకొని,మనం భగవంతుని కొరకే జీవించాలి.భగవంతుని కొరకే మరణించాలి.
  17. మన తోటి వారిని ప్రేమించడమే భగవంతుని ప్రేమించడానికి అత్యంత ఆచరణ సాధ్యమైన విధానం.మనకు ప్రియమైన వారి గురించి ఏ విధంగా భావిస్తామో, ఆ విధంగానే ఇతరుల గురించి కూడా భావించగలిగితే, మనం భగవంతుని ప్రేమించిన వారమౌతాము..  

No comments:

Post a Comment