Thursday, August 09, 2012

Devarakonda Balagangadhara Tilak












  1. గజానికొక గాంధారి కొడుకు గాంధీగారి దేశంలో.
  2. అమెరికాలో డాలర్లు పండును,ఇండియాలో సంతానం పండును. 
  3. భూమి తనచుట్టూ తానూ తిరుగుతూ ధనవంతుడి చుట్టూ తిరుగుతోంది.
  4. దరిద్రం సముద్రంలో వేధనల తెరచాపలెత్తి ప్రయాణించే జీవన నౌకలకు మృత్యువే లైట్ హౌస్.
  5. ప్రిజం లాంటిది జీవితం, వేర్వేరు కోణాలూ ప్రదర్శిస్తుంది.
  6. మాలిన్యం మనసులో వున్నా మల్లెపువ్వులా నవ్వడం ఈనాటి తెలివి.
  7. భూమధ్యఏఖ దగ్గరకన్నా ఆడదాని భ్రూమధ్యరేఖ దగ్గర వేడి ఎక్కువ.
  8. ఎన్నికలలో ఎగరవేసిన వాగ్దానపు కత్తులకి మొనకన్నా పిడి దగ్గర వాడి ఎక్కువ.
  9. మతం నల్లమందు గతం ముదిమికి  విందు.
  10. గతమంతా తోలుబొమ్మలాడిన ఒక తెర, వర్తమానం నీ కన్నుల గప్పిన ఒక పొర.
  11. యుద్ధం మీద యుద్ధం వచ్చినా మనిషి గుండె పగులలేదు.
  12. మనషి మీద మనిషి చచ్చినా కన్నుతుదల జాలిలేదు.
  13. దరిద్రుని నోరులేని కడుపు తెరుచుకొన్న నాలుక బూడిదలో వ్రాసుకొన్న మాటలు మీరెపుడైనా చూశారా? కన్నీరైనా విడిచారా? 
  14. కూడులేని లోకం ఇది,గుండె లోతు తాపం ఇది.
  15. శాంతి కోసం యుద్ధాన్ని ప్రజ్వలింప చేస్తారు,సుఖం కోసం ఆ రక్త విప్లవాన్ని తరింపచేస్తారు.
  16. ఒక సత్యంతో మరో సత్యాన్ని ఖూనీ చెయ్యకు,పరదేశ స్థుతిలో స్వకీయ సంస్కృతి విస్మరించకు.
  17. వివేకంలేని ఆవేశం విప్త్కరమౌతుంది,సయమనం లేని సౌఖ్యం విషాదకారణ మౌతుంది.
  18. కరుణ లేని కవివాక్కు సంకుచిత మౌతుంది.
  19. అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తుంది.
  20. పొరుగువాడి మంచితనం దుష్టుడి దురహంకారాన్ని రెచ్చగొడుతుంది. పక్కవాడి సౌభాగ్యం బాలిశుడి గుండెల్లో మంటల్ని రేపుతుంది. 
  21.  ప్రజల నోళ్లుకొట్టి ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి గజదొంగ లీనాడు రాజులై రారాజులై ఏలుతున్నారు.
  22. అవకాశవాదులు నోరుతెరిస్తే దుర్వాసన నీతిని విడిచిపెడితే రాజనీతి అవుతుంది. 
  23. జాతికి మతావేశం పొదిగితే కోతి అవుతుంది.
  24. చావు పుట్టుకలమధ్య సందేహం లాంటి జీవితంలో నలువైపులా అంధకారం.
  25.  మానవ చరిత్ర పుటలలో నెత్తురొలికి మాసిపోయిన అక్షరాల్ని వివరించు.
  26. దేవుడా! రక్షించు నా దేశాన్ని పవిత్రులనుండి పతివ్రతలనుండి,పెద్దమనుషులనుండి పెద్దపులులనుండి.
  27. గతంలో కూరుకుపోయిన మనుష్యులు గతించిన కాలపు నీడలు
  28. మధ్యతరగతి ప్రజలు సంఘపు కట్టుబాట్లుకి రక్షకభటులు,శ్రీమంతుల స్వేచ్చావర్తనకి నైతిక భాష్యకారులు. 
  29. తమని తామే మోసగించులొనే విద్యాధికులు తమ చెట్టుకొమ్మని తామే నరుక్కొనే అమాయాకులు,సంప్రదాయకులు.
  30. కృత్రిమమైన మనసులూ మాటలూ కిచాటుగా నిండిపోయిన లోకంలో నిజాయితీగా నిండుగా పలికే గొంతు నిజంగా ఎంతో అవసరం.
  31. కవితవున్నప్పుడే నవత రాణిస్తుంది,అసలు కవితలోనే నవత కూడా ఉంది. 
  32. ప్రతి మాటకీ శక్తి ఉంది,పదును వుంది.ప్రతీ చిత్రణకీ అర్ధం ఉంది ఔచిత్యం ఉంది.
  33. మాటలు పేర్చడం కవిత కాదు, మంత్రం తంత్రం అసలేకాదు.
  34. మహాత్ముల మనీషుల రుధిరంతో మరకపడింది ధరిత్రి వదనం.
  35. రోడ్లమీద అజ్ఞాతకామం ప్రతిరోజూ రాత్రి ప్రవహిస్తుంది.
  36.  కాలానికీ నిలబడ గలిగినదీ వద్దన్నా పోదు.
  37. యుగయుగానికి స్వభావం మారుతుంది.  
  38. ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిరబిందువు నైక నదినదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సింధువు.
  39. దేవుడూ మానవుడూ వీరిద్దరే ఈ అనంత విశ్వంలో మూర్ఖులు ఏ కోణం నుంచి చూచినా వీరిద్దరూ మిజరబుల్ ఫెయిల్యూరల్స్.
  40.  జీవితం నవనీతం పాత్ర మీద చెదరపడనీకూ రాయినీ రప్పనీ పగులుతుంది స్వప్నం రగులుతుంది దుఖం.
  41. అంధయుగమైనా స్వర్ణయుగమైనా అది మన ప్రతిబింబం.
  42. కాలం వలయం లాంటిది దానికి కేంద్రం లేదు.
  43. కాలం అద్దంలాంటిది.
  44. సాహసి కానివాడు జీవన సమరానికి స్వర్గానికి పనికిరాడు.
  45. నమ్మకు నవ్వలేనివాడిని, పువ్వులు చిదిమేవాడిని.
  46. దేశానికి హద్దులూ ప్రవర్తనకీ ఎల్లలూ ఆవేశాలకు మితీ,కావాశాలకి పరిమితీ అవసరం మానవ సౌఖ్యానికి సఖ్యానికీ.
  47. కవిత్వం మారిపోతుంది.కవితా స్వభావం మారిపోతుంది.
  48. ప్రాణానికి ఏ రూపం కావాలో ఏ రూపం సరిపోతుందో ప్రాణమే నిర్ణయించుకుంటుంది.
  49. ఎక్కడ చూసిన ధీన నయనాలా ప్రశ్నలు మౌన విశ్వాసాల పిలుపులు. బావురుమనే గుండెల ఏడ్పులు,బాధల సలసల కాగే బ్రతుకులు.
  50. ముసలిదైపోయింది భూమి మూర్ఖులైన తన కొడుకుల్ని చూసి.
  51. సమ సమాజం అంతటా గుప్తంగా ఉన్న కుటిల బుద్ధి స్వభావం.
  52. రాత్రిని రంపం పెట్టి కోసినపుడు రాలిన పొట్టులాగుంది వేకువ.

No comments:

Post a Comment