Monday, July 02, 2012

Si Sri Ravisankar
















  1. ఎటువంటి కల్మషం అంటని మనసుతో, అత్యంత గొప్ప వ్యక్తిత్వంతో మనిషి భువిపై అడుగుపెడతాడు. అంత స్వచ్ఛమైన వ్యక్తిత్వం పతనం దిశగా దారితీస్తే... దాన్ని తిరిగి సంపాదించుకోవడం అసాధ్యం!
  2. కొత్త రకం మొబైల్ వాడటం నేర్చుకొన్నట్టే, మనసును ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నేర్చుకోవాలి. మీ దైనందిన జీవితంలో మెడిటేషన్‌కు కొంత సమయాన్ని కేటాయిస్తే, శరీరానికి కావలసినంత శక్తిని ఇచ్చినట్టే! 
  3. మనిషిలోని దురాశ, భయాలను పొగొట్టి, ఎటువంటి ఒత్తిడి లేని జీవితాన్ని, అశాంతి, హింసలు లేని సమాజాన్ని తీసుకురాగల ఫార్ములా నా దగ్గర ఉంది. 
  4. విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అనుకూల స్థితిలో ఉన్న శరీరం... జాలి, దయ ఉన్న కారుణ్య హృదయం... అస్పష్టత లేని మెదడు... బాధలేని ఆత్మ... ఇవి మనిషి ఆరోగ్యంగా ఉన్నాడనడానికి రుజువులు!
  5. దేశంలో అవినీతిపై పోరాటం మొదలై నప్పుడు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ను కూడా అంతం చేయాలని కొంతమంది ప్రయత్నించారు. మేం వాస్తవాన్ని మాట్లాడటానికి ఎప్పుడూ వెనకడుగు వేయం. అది ఎవరికి రుచించకపోయినా ఇలాగే కొనసాగుతాం. 
  6. అయామ్ నథింగ్, ఐ వాంట్ నథింగ్, అయామ్ డూయింగ్ నథింగ్... మెడిటేషన్‌కు సంబంధించి బంగారం లాంటి సూత్రాలివి.
  7. విద్య మనిషికి ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. మనం సమాజం నుంచి ఏం స్వీకరించామో, అది తిరిగి చెల్లించడమే విద్య అంతరార్థం.

2 comments:

  1. chudataniki chala sadaranamaina manishi, venuka chiste pedda kutumbamu kadu samanyamina chinna kutumbam pedda pedda parichayalu levu kani mahatmulanta amarulai mana manasulo nilichipoyaru,
    jivitam lo prati manishi puttuka venuka oka antarardam untundi adi manasuku ardamaina roju prati vekthijivitam lo marchipoleni rojunu anubavistaru..do some thing.. create your new world.. join all of them...

    ReplyDelete
  2. మీరు చెప్పినది అక్షరాల నిజమండి...సురేఖ గారు...అన్నట్లు మీకు నా బ్లాగులో చేరాలన్నారు కదా రాసేందుకు సరేనండి మీకు నా బ్లాగు నుండి రిక్వెస్ట్ పంపుతాను.

    ReplyDelete