Monday, September 12, 2011

Ram Gopal Varma

















  1. ఏ సమయంలోనైనా నువ్వు ఎవ్వరి నుంచైనా ఏదైనా ఆశిస్తున్నావంటే  సదరు వ్యక్తి అప్పటికే నిన్ను తన అదుపులో ఉంచుకోవాలని  ప్రయత్నిస్తాడు. 
  2. ఒక 'వాస్తవం' ఉనికిలోకి  వచ్చాక  మనం ఎన్ని సిద్ధాంతాలైనా రూపొందించుకోవచ్చు.
  3. జీవితంలో తప్పులనేవి జరుగవు. వెయిట్ చేస్తే అవన్నీ ఒప్పులుగా మారుతాయి. 
  4. విభిన్నంగా ఉండటమంటే స్వతంత్ర్యంగా ఉండటమే.
  5. ఎన్ని రకాలుగా,ఎవడు,ఎందరికీ ప్రేరణ కలిగించినప్పటికీ ఎంత మంది పరిపూర్ణతకు నమూనాగా నిలబడ్డవాడైనప్పటికినీ చిట్టచివరకు చనిపోవాల్సిందే .
  6. మన మనసులో అనుకున్నదానికి,ప్రాక్టికల్ గా తీయడానికి మధ్యవున్న రేఖ చాలా బలమైనది.
  7. నా ఫ్లాప్ సినిమాలన్నీ నేను ఇంటెన్షనల్ గా తీసినవి. హిట్ సినిమాలన్నీ అనుకోకుండాసంభవించినవి.
  8. సినిమా తియ్యాలని డిసైడ్ చేసే ముందు అనుకున్నవన్నీ కరెక్టనిపిస్తాయి. కానీ ఫ్హ్లాపైన తరువాత ఇంకా కరెక్ట్ కారణాలు తెలుస్తాయి.
  9. జీవితంలో ఏదైనా  మనం మనసా వాచా నమ్మితేనే చేస్తాం. కానీ అందులో ఏది సక్సెస్ అవుతుంది?ఏది కాదు? అనేది చాలా అరుదుగా తప్ప మన ఆధీనంలో లేదు. 
  10.  వైఫల్యమంటే తీసుకున్న నిర్ణయం తప్పవడం అంతే! మనమంతా ఇతరుల తప్పులను ఎత్తి చూపడంలో,విమర్శించడంలో నిష్ణాతులం. చాలా అరుదుగా మాత్రమే మన సొంత తప్పుల్ని గుర్తిస్తాం. అంతమాత్రాన అది అపజయపు దారుల్లో అడుగు పెట్టకుండ మనల్ని ఆపదు.
  11. పుట్టిన తరువాత ఏం చేసావన్న దాంట్లో సెలెబ్రేషన్ ఉండాలి. కానీ పుట్టినందుకే సెలబ్రేట్ చేసుకునేవాళ్లు అత్యంత మహా చేతగాని వాళ్లని నా నమ్మకం.

No comments:

Post a Comment