Sunday, October 02, 2011

Plato












  1. అజ్ఞానమే అన్ని దురదృష్టలకు హేతువు. ఏదోఒకటి నేర్చుకోకపోవడం కంటే అసలు పుట్టకుండా ఉండటమే మంచిది.
  2. ప్రేమించడంలో ఆనందం ఉంది. పురుషుడికైనా చివరికి స్త్రీకైనా చివరకి మిగిలేది అదే.
  3. ఆత్మవంచన ఆధమాధమం.
  4. నేటి మానవుని కోర్కె ఆరోగ్యంగా,సంతోషంగా జీవించడం నుంచి భూగోళాన్ని జయించడం వైపు మళ్లింది.
  5. ఆరోగ్యం మీద ధ్యాస ఉంటే అది నేర్చుకోవడం, నూతన ఆవిష్కరణకు నూతన అధ్యయానికి ప్రతిబింబించడం అవుతుంది.
  6. ఆరోగ్యాన్ని గురించి శ్రద్ద వహించడమే జీవితంలో పెద్ద అవరోధం.
  7. ఆత్మ తనలో తాను మాట్లాడుకోవడమే ఆలోచన.
  8. లోకం గిట్టని వాళ్లు,మానవ ద్వేషులు ఉన్నట్లే. పురాణ గాథల్ని నమ్మేవాళ్లు, నూతన భావనలను వ్యతిరేకించేవాళ్లు వుంటారు.
  9. మనుషుల మనసుల్ని పాలించే కళ ఉపన్యాసం.
  10. ప్రేమలో మునిగిన ప్రతివాడు కవే.
  11. కవులు గొప్ప తెలివైన విషయాలను ఉద్రేకపరుస్తారు. వారి ఆలోచనలు వారికి కూడా అర్ధం కావు. 
  12. క్షేత్ర గణితం నా ఇంట్లోకి వచ్చిందని తెలుసుకోండి.
  13. తత్వశాస్త్రం పరిణితి చెందిన సంగీతం.
  14. దేవుడు సత్యం. జీవితం దాని నీడ.
  15. ఎక్కడ చూసినా న్యాయవాదికి ఒకటే మూలసూత్రం. బలవంతుడ్ని రక్షించడమే. 
  16. ప్రజాస్వామ్యం చిట్టచివరకు నియంతృత్వానికి దారితీస్తుంది.
  17. ఏ పుస్తకంలో అయినా ప్రారంభమే ప్రధాన భాగం.
  18. ప్రేమ ఒక మానసిక వ్యాధి. 
  19. మంచికి ఆనందం,తెలివికి వింత, దేవునికి ఆశ్చర్యం- అదే ప్రేమ.
  20. ఆత్మకు జ్ఞానమే ఆహారం.

No comments:

Post a Comment