Wednesday, June 01, 2011

Leo Tolstoy











  1. ప్రతి ఒక్కరు ఎదుటివాళ్ళని మార్చాలని చూస్తారు తప్ప, తమని తాము మార్చుకోవాలని అనుకోరు.
  2. న్యాయస్థానం  ఉద్దేశ్యం చెడ్డమనిషిని అడ్డుకోవడమే.
  3. అధికారం పొందడానికి దాన్ని నిలబెట్టుకోవడానికి ఆ మనిషికి అధికారం మీద ప్రేముండాలి.
  4. జీవితపు చివరి విలువ మనల్ని మనం తెలుసుకోవడం. ధ్యానశక్తిని సంపాదించడం మీద ఆధారపడి వుంటుంది. అంతేకాని మనం జీవించి వుండటం వల్లకాదు.    
  5. కళ ఒక విశ్వజనీనమైన భాష.
  6. చరిత్రకారులు చెవిటివారు. ఎవ్వరు అడగని ప్రశ్నలకు జవాబులు చెపుతారు.
  7. చెడును ఉపేక్షించడం అంటే మంచిని నిర్లక్ష్యం చేయడమే.
  8. జీవితాంతం  దుఃఖం ఎన్నడు లేకపోవడం అనుమానమేలేని సత్యం.
  9. నిజమైన సంపూర్ణమైన దుఃఖం  లేనట్లే, నిష్కల్మమైన సంపూర్ణమైన ఆనందము వుండదు.
  10. మనిషి గురించి నువ్వు ఆలోచించు,దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు.
  11. సాధారణంగా ధైర్యాన్ని గురించి మాట్లాడే వారు పిరికి వాళ్లుగాను, గౌరవాన్ని  గురించి మాట్లాడే వాళ్ళు దుర్మార్గులుగాను వుంటారు.
  12. పొరపాట్లను గమనించు.కాని బాధపడకు,వాటిని నీ ఆస్తిగా పరిగణించు.
  13. అర్ధం చేసుక్కున్న ప్రతిదీ నేను ప్రేమించడం వల్లే అర్ధం చేసుకున్నాను.
  14. ప్రతి మనిషిని సమానంగా ప్రేమించలేము.
  15. ఎన్నో నమ్మకాలు ఉన్నా నాలో,నీలో ప్రతిమనిశిలో జీవం ఒక్కటే.
  16. జీసస్ ఎన్నడు వ్యక్తిగత పునర్జన్మను గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత ఏమిటి? అనీ చెప్పలేదు.      
  17. ప్రేమే మంచి, కాని ప్రేమ ఒక్కటే వుండదు. దానికి స్వచ్చత కలిసి వుండాలి.
  18. ప్రపంచాన్ని ఎలా మార్చాలా అని అందరూ తీవ్రంగా ఆలోచించి తలలు పట్టుకోనక్కర్లేదు.ఎవరికి వారు తమని తామూ మార్చుకుంటే చాలు.

No comments:

Post a Comment