Tuesday, May 17, 2016

YS Rajasekhara Reddy

 1. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు, పేదింట్లో  పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు ఉన్నత చదువులు చదవాలి.
 2. అన్నం పెట్టె రైతన్నను రుణ విముక్తున్ని  చేయడమే నా లక్ష్యం.
 3. నేను కలలుగన్న మరో ప్రపంచానికి మహిళలే మూలస్తంభాలు.
 4. రాష్ట్ర ప్రజలకు జీవితాంతం సేవ చేయడమే భాగ్యం.
 5. ఆర్ధిక అసమానతలు తొలగకపోతే  రాజకీయ స్వాతంత్ర్యానికి అర్ధం లేదు  
 6. ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగు పడాలి. అందుకు అధికారులు నిబద్ధత,పారదర్శకత,కార్యదీక్షతో పనిచేయాలి.
 7. ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా మారుమూల పల్లెలకు వెళ్ళాలి.
 8. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.
 9. పేద ప్రజల ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. రాజీవ్ ఆరోగ్య శ్రీ సంజీవనిలా పనిచేస్తుంది, ఈ తృప్తి చాలు.
 10. బీడు తెలంగాణ భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరులు పండాలి.
 11. రిలయన్స్ గ్యాస్ అందుబాటులోకి వస్తే మూడో పంటకు కూడా విద్యుత్ సరఫరా చేస్తాం.  అప్పుడిక ప్రతి రైతు ఇంట సంక్రాంతే.
 12.  మహిళల ముఖాలు కలకలలాడుతూ ఉంటేనే కుటుంబమూ,సమాజమూ బాగుంటాయి.
 13. నా అక్కలూ,చెల్లెళ్ళు..తముళ్ళ కళ్ళలో వెలుగులు చూసినపుడే నా  నిజమైన పుట్టినరోజు. 
 14.  ప్రతిరైతు పట్టణ ప్రాంత వ్యక్తితో సమానంగా ఆదాయం పొందాలన్నదే నా  అభిమతం.  
 15. ప్రాజక్టులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలు ఎవరినీ క్షమించవు.
 16. పారిశ్రామిక రంగానికి దీటుగా సేద్య రంగం ఎదగాలి. వ్యవసాయ ఫలాలు పదింతలు పెరగాలి.
 17. అవినీతి,అసత్య వార్తలు క్యాన్సర్ కన్నా ప్రమాదకరం.
 18. జల ప్రాజక్టులపై  జనం  ఎన్నెన్నో   ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ నమ్మకం వమ్ము కాకూండా పనిచేయాలి.
 19. గ్రామాల్లో సంపద పెరగాలి  పెరిగిన సంపద గ్రామీణ ప్రజలకే చెందాలి.
 20. ప్రజల ఋణం తీర్చుకునేందుకు ఎంతటి కృషికైనా సిద్ధంగా ఉండాలి.
 21. జాతికి జల సౌభాగ్యం కల్పించిన రోజే నాకు అసలైన పండుగ రోజు. 
 22. ప్రాజక్టులు  పూర్తి చేసి శాశ్వత వనరుల ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్  నిర్మించాలి.  
 23. పారిశ్రామిక రంగానికి దీటుగా సేద్యరంగం ఎదగాలి. వ్యవసాయ  ఫలాలు పదింతలు పెరగాలి. 
 24. గ్రామం ప్రగతి పథంలో ఉంటే ఎవ్వరూ ముఠా  కక్షల జోలికి వెళ్లరు. 
 25. ఎన్ని కరువులనైనా ఎదుర్కోగలగాలి, దీని కోసం ఆర్ధికంగా ఎదగాలి. 
 26.  ఆంద్రప్రదేశ్ ను దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్దాలనేది నా స్వప్నం.      
 27. స్వఛ్ఛమైన రక్షిత జలాలను అందిస్తేనే గోండు,చెంచు,ఆదివాసి గిరిజనులు ఆరోగ్యంగా ఉంటారు.
 28. ప్రజల ఋణం తీర్చుకొనేందుకు ఎంత కృషి చేయడానికైనా నేను సిద్ధం.
 29. ప్రతి రైతు వాణిజ్యవేత్తగా మారాలి.
 30. నిరుపేదలకు పట్టెడన్నం దొరికేటట్లు చేయడం ప్రభుత్వ ధర్మం.అందుకు ఎన్ని కోట్లు ఖర్చయినా వెనుకాడకూడదు.
 31. అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమము అంతే ముఖ్యం. 


No comments:

Post a Comment