Friday, October 12, 2012

Farah Khan



















  1. నిజమైన కళాకారుడు ఏదైనా సాధించాలని ఆశపడతాడు తప్ప, ఎదుటివాళ్లను ఓడించాలని కోరుకోడు.
  2. జీవితంలో మనకు ఎదురయ్యే ఏ వ్యక్తినీ మనం చిన్నచూపు చూడకూడదు. ఎందుకంటే వాళ్లు జీవితంలో మనకు మరోసారి ఎదురుపడవచ్చు. అప్పుడు వారు మనకన్నా గొప్పస్థాయిలో ఉంటే మనమే తలదించుకోవాల్సి వస్తుంది. 
  3. నా పిల్లల్ని ఒడిలో పడుకోబెట్టుకుని నిద్రపుచ్చడంలో ఉన్న ఆనందం నాకు మరెందులోనూ లేదనిపిస్తుంది. బహుశా ప్రతి తల్లికీ ఇలాగే ఉంటుందేమో!
  4. నువ్వు దేన్ని అందుకోవడానికీ కష్టపడకపోతే, ఏదీ నీకు అందుబాటులోకి రాదు. కష్టే ఫలి అని గుర్తుపెట్టుకోవాలి!
  5. నటించడం ఎంత కష్టమో నా పిల్లలతో దొంగ-పోలీస్ ఆడినప్పుడు అర్థమవుతూ ఉంటుంది నాకు. ఎందుకంటే వాళ్లు ఎక్కడ దాక్కున్నారో నాకు చెప్పేస్తారు. కానీ వాళ్లను పట్టుకోకూడదని కండిషన్ పెడతారు!
  6. నిన్ను ఎవరు ఏమన్నారన్నది ముఖ్యం కాదు. వారన్నదానికి నువ్వెలా రియాక్టయ్యావన్నది ముఖ్యం. కొన్నిసార్లు తప్పుకుని వెళ్లిపోవడం కంటే, నిలబడి నవ్వడం మంచి ఫలితాన్నిస్తుంది!
  7. నేను ఆశను కోల్పోయినప్పుడు వెంటనే దేవుడిని తలచుకుంటాను. ఎందుకంటే, నా నిరాశ కంటే ఆయన ప్రేమ గొప్పది. నా ఆశయాల కంటే నా భవిష్యత్తు కోసం ఆయన వేసే ప్రణాళికలు గొప్పవి!

1 comment: