- విప్లవాన్ని నిషేధించబోవడం అంటే...భేరిని జోకొట్టడం లాంటిదే.
- ఏదీ తనంత తానే నీ దరికి రాదు...శోధించి సాధించాలి...అదే ధీరగుణం.
- వందమంది చేయలేని పని ఓ హేళన చేస్తుంది.
- బాధకు పర్యాయపదం కవిత్వం.
- కుక్కపిల్ల,అగ్గిపుల్ల,సబ్బుబిళ్ల-కాదేది కవిత కనర్హం.
- పసిడి రెక్కలు విరిసి కాలం పారిపోయిన జాడలేవి? ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సముహలేవి తల్లీ.
- నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.
- ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మను గురించి ఆలోచించడం అజ్ఞానం.
- అణ్వాస్త్రాలు కాదు అన్నవస్త్రాలు ముఖ్యం.
- తెలుగు భాషకు కవిత్రయం తిక్కన, వేమన, గురజాడ.
- ఆ రాణి ప్రేమ పురాణం, ఆ ముట్టడి కైన ఖర్చులు, మతలబులు, కైఫీయతులు, ఇవి కాదోయ్ చరిత్ర సారం.
- ఏ దేశపు చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం
- కటుకథకూ, పెట్టుబడికీ పుట్టిన విషపుత్రికలు (మీడియాపై చేసిన వ్యాఖ్య)
- కాదేదీ కవితకనర్హం
- కొంతమంది యువకులు పుట్టుకతో వృధ్ధులు
- తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
- పదండి ముందుకు, పదండి ముందుకు తోసుకుపోదాం పైపైకి.
- ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం
- ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీ లెవ్వరు?
- వేయిపడగలు, లక్ష పిడకలు, కాగితప్పడవలు, చాదస్తపు గొడవలు. (విశ్వనాథ సత్యనారాయణ యొక్క వేయిపడగలు రచనపై చేసిన వ్యాఖ్య)
- వ్యక్తికి బహువచనం శక్తి
- హింస తోనే సృష్టి పూస్తది; హింస తోనే మార్పు వస్తది
- హీనంగా చూడకు దేన్నీ, కవితామయమోయ్ అన్నీ.
- మంటలచేత మాట్లాడించి, రక్తం చేత రాహాలాపన చేయిస్తాను
- ముత్యాలలాంటి తెలుగక్షరాలంటూ లిపిమీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్ లిపిలో(a,aa,i,ee ఈ విధంగా) తెలుగును నేర్పితే అప్పుడు మన దేశం ఆధునిక యుగం లోనికి ప్రవేశిస్తుందని నా నిశ్ఛితాభిప్రాయం. ప్రపంచ తెలుగుమహాసభ వారు ఈ విషయమై ఆలోచించడం మంచిదని నేననుకుంటున్నాను.
- తెలుగే మన జాతీయ భాష కావాలనేది నా అభిమతం.ఇది భాషా దురభిమానంతో అంటున్న మాటకాదు. తెలుగు భారతదేశం అంతకీ జాతీయభాష కాగల అర్హత గలదని జె.బి.యస్.హాల్డేన్ అన్నారు. సంస్కృత పదాలను జీర్ణించుకున్న కారణంచేత అటు ఉత్తరాదివారికీ, ద్రావిడ భాషా కుటుంబంలో ఒకటి కావడంవల్ల ఇటు దక్షిణాది వారికీ తెలుగు నేర్చుకోవడం చాలా సులభమని హాల్డేన్ పండితుని వాదన. దేశంలో హిందీ భాషదే మొదటిస్థానమయినా, ఆ భాష మాట్లాడే వాళ్ళంతా కలిపి నలభై శాతానికి మించరు. అంతేకాక హిందీ ఒక చిన్నచెట్టుకు పరిమితం!రెండవ భాష అయిన తెలుగు సుమారు ఆరుకోట్ల మంది ఆంధ్రులకు మాతృభాష! పైగా తెలుగువారు దేశమంతటా, అన్ని రాష్ట్రాలలోనూ వ్యాపింఛి ఉన్నారు.
- ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను 'సామాజిక వాస్తవికత ' అంటారనీ, దీని వెనుక దన్నుగా మార్క్యిస్ట్ అనే దార్శనికత ఒకటి ఉందనీ అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడొక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, మహాప్రస్థాన గీతాల లోని మార్క్సిస్టు స్ఫూర్తీ, సామాజిక స్పృహా యాదృఛ్ఛికాలు కావని స్పష్టంగా తెలుస్తోంది
Tuesday, July 19, 2011
Sri Sri
Subscribe to:
Post Comments (Atom)
GREAT MAN ....
ReplyDeletethanx for ur compliment about Sri Sri
ReplyDeleteReally good dear, shashidhar
ReplyDeletethanks for providing valuable things.......
ReplyDeletethis is very good...
ReplyDeletesuperb man.......
ReplyDeleteGr8 sri sri gaaru as well as srinivas keep it up.
ReplyDeletetnx JavaHeart...Sry I dnt knw ur name
Deletekeep it up
Deletetnx for ur compliment
ReplyDeletechala chala chala chala bagunai.chala useful.keep it up
Deletetnx gumdala arsha vidya gaaru
Deletethks for posting this bcoz i am searching from a long time
ReplyDeletetnx broyher visit again
Delete