- చదువుకు క్రమశిక్షణ తోడైతే బంగారానికి తావి అబ్బినట్లుంటుంది.
- ఒక వ్యక్తిని త్వరగా అర్ధం చేసుకోకపోయినా ఫర్వాలేదు, కానీ అతిత్వరగా అపార్ధం మాత్రం చేసుకోవద్దు.
- నీ ప్రవర్తన పది మందికి మార్గాదర్సాకంగా ఉండాలి. పదిమంది విమర్శించ కుండా మసలుకో.
- జీవితంలో కోట్లకు కోట్లు సంపదిన్చినపుడు కలగని ఆనందం ఒక మంచి మిత్రుణ్ణి పొందగలిగినపుడు కలుగుతుంది.
- గొప్పదనం బలంలో లేదు , ఆ బలాన్ని వాడుకోవడంలో ఉంది.
- మంచిని భోదించే మహనీయులు మండుతున్న కాగడాల వంటి వారు. తాము కాలిపోతు ఇతరులకు వెలుగునందిస్తారు.
- కాంతి ఏ దీపం నుంచి వచ్చినా మంచిదే , గులాబి ఏ తోటలో విరిసిన అందంగా ఉంటుంది.
- మెదడుకు శిక్షణ ఇస్తే చాలదు, హృదయాన్ని సున్నితం చేయాలి, ఆత్మకు క్రమశిక్షణ ఇవ్వాలి, అప్పుడే అది సమగ్ర విద్య అవుతుంది.
- గ్రంథాలయాల ద్వారా సాహిత్యం నుంచి జీవితంలోకి ప్రవేశిస్తాము.
- మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం.
- కలలు వాస్తవాలు అయితే, వాస్తవాలనే కలలుగా భావించుకో.
- మనం ముందుకు సాగుతున్నాము, అయితే లక్ష్యం ఇంకా దూరంలోనే వున్నది.
- విజయం మనిషిలో పగ అనే ఆరని అగ్నిని రాజేస్తే , ఆ తర్వాత అది విజేత దుఃఖానికి కారణం అవుతుంది.
- మనం ఎందుకు జన్మించామో తెలుసుకోకుండానే మనలో చాలా మంది ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోతుంటారు.
- చెడును అడ్డుకోవడం బాధ్యత కాదు, అదో హక్కు.
- ఉన్నదానితో సంతృప్తి పడటం ఉత్తమం, మనకున్న జ్ఞానం చాలని భావించడం అజ్ఞానం.
- నిజమైన సత్యాన్ని నమ్మేవాడు అణుకువతో వుంటాడు.
Sunday, June 26, 2011
Sarevepalli Radhakrishnan
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment