Sunday, August 21, 2011

Confucius

















  1. మనలోని గొప్పదనం, మనకి వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవడంలోనే దాగి ఉంది.
  2. ఎదుటివారి  ఆత్మగౌవరవాన్ని , అభిమానాన్ని  కించపరచనంత     కాలం  నీవు  మంచివాడవే.
  3. తగిలిన దెబ్బలనైనా మర్చిపోవచ్చు కాని పొందిన మేలునెప్పుడు మర్చి పోకూడదు. 
  4. ప్రతి వస్తువులోనూ ప్రత్యేక సౌందర్యం ఉంటుంది. అయితే అందరు దానిని చూడలేరు. 
  5. అజ్ఞానం మనస్సుకు  రాత్రి వంటిది. ఆ రాత్రిలో తారాచంద్రులు కూడా ఉండరు. 
  6. మనుష్యుల ప్రకృతి ఒకటే. వారి అలవాట్లే భిన్నమైనవి.
  7. పరీక్షించుకో ఆత్మ విమర్శ  చేసుకో
  8. గొప్ప మనిషి ఏ అభిప్రాయం మీద తన మనస్సు లగ్నం చెయ్యడు. ఏ అభిప్రాయాన్ని వ్యతిరేకించడు.
  9. ఆలోచనలేని అభ్యాసం కష్టాన్ని వృధా చేసుకోవడమే.
  10. నేర్పులేని ఆలోచన గాలిలో తేలుతుంది. ఆలోచన లేకుండా నేర్చుకోవడం నష్టదాయకం.
  11. భవిష్యత్తు గురించి ఆలోచించి పథక రచన చేయువాని  ఇంటి ముందే సమస్యలు ప్రత్యక్షమవుతాయి.
  12. శిక్షణలో వర్గ విభజన మంచిది కాదు.
  13. నీ ఇంటిముందు మెట్లు అపరిశుభ్రంగా వుంచుకొని నీ ప్రక్కింటి పైకప్పుపై మంచు వున్నదని పిర్యాదు చేయకు.
  14. కోపోద్రిక్తుడైన  మనిషి నిండా విషం వుంటుంది.
  15. కుటుంబాలు నిజాయితీగా వుంటే ఆ జాతి బలంగా వుంటుంది.
  16. జాగ్రత్తపరులు తప్పులు చెయ్యడం అరుదు.
  17. ఇతరులు నీకు ఏది చెప్పనవసరం లేదని అనుకుంటున్నారో నువ్వు అదే పని ఇతరులకు చెయ్యకు.
  18. సరిగ్గా నిర్వహించటం చేతకానివాడు బాధపడటం తప్పదు.
  19. సత్యాన్వేషి అయిన పండితుడు తన ఆహార్యాన్ని, ఆహారాన్ని గురించి సిగ్గుపడితే సంభాసించడానికి అతడర్హుడు  కాడు.
  20. తప్పును సరిదిద్దుకోక పోవడమంటే  మరో తప్పు చేసినట్లే.
  21. అవసరాలను తీర్చమని అడగని ప్రేమ ఉందా?
  22. పొదుపు చేయకుంటే వ్యధ తప్పదు.
  23. సుదూరంలో ఏమవుతుందో ఆలోచించుకుంటే, నీ దగ్గరలోనే బాధలు ఉంటాయి.
  24. పేరు సరిగా కాకుంటే భాష ఆ వస్తువుతో సరిగా అనుసానిందించపబడినట్లు కాదు. 
  25. అధికుడైన మనిషి మంచేదో అర్ధం చేసుకుంటాడు. అధముడు ఏది అమ్ముడవుతుందో నేర్చుకుంటాడు.
  26. శత్రువులోని మంచిని, మిత్రుడిలోని చెడును సమదృష్టితో చూడగలిగినవాడు  మహాత్ముడు.
  27. మాటల యొక్క శక్తి తెలియనివాడికి మనిషి గురించి ఏమి తెలియదు.
  28. జీవితమంటే తెలియదు మరి మృత్యువు ఎలా తెలుస్తుంది.
  29. నీతో సమానం కానివారితో స్నేహం చేయకు.
  30. యువకులను గౌరవించాలి. అతని భవిష్యత్తు మనకు సమానం అవుతుందని నువ్వెందుకు ఆలోచించావు.
  31. ఏది తర్కమో అదే చెపుతాడు వివేకి, ఏది అధర్మమో అదే చెపుతాడు అల్పుడు.
  32. సత్యం మనిషిని గొప్పవాణ్ణి చెయ్యదు, సత్యాన్ని కనుగోన్నవాడే గొప్పవాడు.
  33. ఉత్తమ మానవుని లక్ష్యం సత్యం.
  34. శిక్షణ లేని జనాలను యుద్ధానికి పంపడమంటే వాళ్ళను విసిరి వేసినట్లే.
  35. స్వర్గమంటే దేవునితో సంపర్కమే.
  36. ఇష్టమైన పనిని ఎంత చేస్తున్నా అలసట తెలియదు.

No comments:

Post a Comment