Thursday, August 19, 2010

Mahathma Gandhi





  1. విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు. అది అచంచలమైనది, హిమాలయాలంత స్థిరమైనది. 
  2. సాధ్యమని తలిస్తే ఎంతటి పనైనా సులువుగా పూర్తవుతుంది.
  3. మనం    మనకోసం  చేసేది మనతోనే అంతరించి పోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి వుంటుంది.  
  4.  కష్టపడి  పనిచేయని వ్యక్తికీ తిండి తినే హక్కులేదు. 
  5.  ముఖం మీద చిరునవ్వు లేకపోతే అందమైన దుస్తులు వేసుకున్నా ముస్తాబు పూర్తికానట్లే.
  6.  దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాలమేడలు,రంగులగోడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. 
  7.  ఒప్పుకున్న తప్పు చీపురులా దుమ్మును చిమ్మి మనసును శుభ్రం చేస్తుంది.
  8. మన ఆత్మగౌరవాన్ని మనమే కోల్పోవాలి తప్ప దాన్నీ దిగజార్చే శక్తి ఎవరికీ ఉండదు. 
  9. అహింస అంటే బలవత్తరమైన ఆటుపోట్లను సహించేది,అనురాగాన్ని, మమతను పెంచేది.
  10. నీ అంగీకారం లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు.
  11. బలహీనుడిలో క్షమాగుణం ఎన్నటికీ కనిపించదు, అది బలవంతుడి లక్షణం.
  12. జీవితమంటే విశ్రాంతి కాదు, చైతన్యం అందుకే జీవితమంతా ఆచరణ,ఆచరణ,ఆచరణ.
  13. గురువును మించిన పాఠ్యగ్రంథం లేదని నిరంతరం విశ్వాసిస్తాను.  
  14. విశ్వాసం కొద్ది మాత్రపు తుఫాను తాకిడికి వాలిపోయేది కాదు, విశ్వాసం అనేది అచంచలమైనది,హిమాలయల్లా స్థిరమైనది. 
  15. నిజాయితీతోనే మన జీవితం నిలబడుతుంది, అవినీతికి దిగినప్పుడే మన పతనం ప్రాంభమవుతుంది.
  16. ఇతరులకి ఉపయోగపడటం,అబద్దాలాడకుండటం, ధర్మాన్ని ఆచరించడం,ఏ ప్రాణికి ద్రోహం చెయ్యకుండా ఉండటం, దయ కలిగి ఉండటం ,సిగ్గు పడవలిసిన పని ఏదీ చెయ్యకుండా ఉండటమే శీలం.
  17. విధి నిర్వాహణకు మించిన దేశసేవ లేదు.
  18. మతాలన్నీ గొప్పవే వాటిలో దోషమేమి లేదు, దోషమంతా వాటిని అనుసరించే మనుషుల్లోనే ఉంది.
  19. నన్ను స్తుతించే వారికంటే నన్ను కఠినంగా విమర్శించే వారి వల్లనే నేను అధికముగా మంచిని పొందియున్నాను.             
  20. మనిషి శీల ప్రవర్తనలను తీర్చిదిద్దలేని విద్య విలువ లేనిది.
  21. సత్యం,ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పక ఉంటుంది.
  22. ప్రయత్నం పురుషుని వంతు అయితే ఫలం ఇవ్వడం  పురుషోత్తముని వంతు.
  23. దేవుడు తనకు తోడుగా నున్నాడని భావించే వాడికి ఎన్నటికీ అపజయం ఉండదు.
  24. శారీరక సామర్థ్యం ద్వారా మనకు బలం రాదు. అణిచి పెట్టలేనంతటి ఆత్మబలం ద్వారానే అది సాధ్యం.
  25. ప్రేమ బాధల్ని సహిస్తుందే కాని ఎప్పుడూ ప్రతీకారాన్ని తలపెట్టదు.
  26. రేపే చనిపోతున్నట్లు జీవించు, శాశ్వతంగా బ్రతికి ఉండేలా భావించి నేర్చుకో.
  27. భయం శారీరకమైన జబ్బు కాకపోవచ్చు.కానీ ఆత్మను చంపేస్తుంది.
  28. శక్తి శారీరకమైన సామర్థ్యం నుంచి రాదు.మనసులో కోరిక నుంచి వస్తుంది.
  29. ప్రపంచంలో నేను ఒకేఒక నియంతను అంగీకరిస్తాను.....అంతర్వాణి.
  30. నా ఇంటి కిటికీలు మూసి ఉండాలని నేనెప్పుడూ కోరుకోను. భిన్నదేశాల సంస్కృతుల పవనాలు వాటి గుండా స్వేచ్చగా ప్రయాణించాలి. అలాగని నా కాళ్లు లాగేస్తానంటే ఒప్పుకోను . ఇతరుల ఇంట్లో బానిసలా, బిచ్చగాడిలా ఉండటాన్ని కూడా అంగీకరించను.
  31. మానవ సమాజం.......మనస్సు,మత,రాజకీయ,సామాజిక అడ్డుగోడలతో విభజింపకూడదు.
  32. భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడం కంటే ఈ క్షణాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడమే నాకిష్టం.
  33. అధికారం రెండు రకాలు,భయపెట్టి సంపాదించేది, ప్రేమతో వచ్చేది. ప్రేమతో వచ్చే అధికారం భయంతో వచ్చేదానికన్నా శక్తివంతమైనది.
  34. రాళ్లతో కట్టబడే ఆలయం కంటే నరాలు,రక్తమాంసాలతో కట్టబడియున్న మనిషి శరీరమే నిజమైన ఆలయం.
  35. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు.
  36. మతము లేకుండా ఏ మనిషి బ్రతుకలేడు.కొందరు తమ అహంకారము వలన తమకు మతానికి ఏ విధమైన సంబంధం లేదు అని చెప్పుతున్నారు. ఈ విధంగా చెప్పడం నేను శ్వాస వదులుతున్నాను. అయితే నేను శ్వాసించలేదు అని చెప్పే విధంగా వుంటుంది.
  37. తప్పును ఒప్పుకోకపోవడం కంటె పెద్ద అవమానం వేరే లేదు.
  38. హృదయం అనేది తెలివి కంటే గొప్పది.మెదడులో తెలివిని చేర్చడం కంటె, హృదయన్ని ఉపయోగించి పెరగడం పైనే దృష్టి సారించండి.
  39. చెడు వేరు,చెడును చేసేవారు వేరు అనే భావనను ఎల్లప్పుడు మర్చిపోకూడదు.
  40. మీరు ఏది చెప్పినను మీ మనస్సుకు,ప్రపంచానికి నిజముగానే నడుచుకోండి.
  41. సమాజం వెంట చేరి మనిషి క్రమశిక్షణతో పని చేయవలెను.
  42. కంటిచూపు లేనివాడు గ్రుడ్డివాడు కాదు, తన తప్పులను తెలుసుకోకుండా ఉంటున్నాడే వాడే నిజమైన గ్రుడ్డివాడు.
  43. దేవుడ్ని దర్శించేందుకు నిజము,ప్రేమ,అహింస అనునవి మూడు మార్గములగును.
  44. కోపమో, పగో లేకుండా కష్టాన్ని ఒకడు భరిస్తే వాడు సూర్యుడికి సమానమవుతాడు...దాని ముందు రాయిలాంటి హృదయమైనా కరుగుతుంది.
  45. సత్యం ఒక వంక, ప్రపంచాధిపత్యం మరో ప్రక్క ఉంటే ఓ మనసా నువ్వు సత్యాన్నే ఎంచుకో.
  46. చిత్తశుద్ధితో ఒక పని మీద దృష్టి కేంద్రికరించ గలిగిన మానవుడు చివరకు దేన్నైనా సాధించగల శక్తిని సంపాదిస్తాడు.
  47. తనను తాను శాసించుకొనలేనివాడు, ఇతరులను శాసించడంలోనూ విజయం పొందలేడు.
  48. ఇతరులు చెప్పిన దాన్ని ఆచరించడంలోనో, వారిని అనుకరించడంలోనో కాదు. మనం సరైనదని నమ్మిన పని చేయడంలోనే నిజమైన సంతోషం, మనఃశాంతి ఉన్నాయి.
  49. ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు. హృదయంలో ఉంటుంది.
  50. ఆత్మ నిగ్రహమున్నవారు, దీక్షగా పనిచేసేవారు మాట్లాడరు.మాటలు,పని ఏకకాలంలో సాగవు, ప్రకృతిని చూడండి. నిర్విరామముగా పనిచేస్తూనే ఉంటుంది నిశ్శబ్దముగా.మన స్వభావాన్ని ఉన్నదానికంటే చాలా మెరుగ్గా ప్రదర్శించాలని తాపత్రయపడతాం.కని మన మానసిక స్థాయి ఎంతలో ఉంటే అంతలోనే కనిపించడం ఎంతో బాగుంటుంది. ఆ స్థాయిని దాటి ఎదగలనుకుంటే మాత్రం ఉన్నతంగా  ఆలోచించాలి. అది సాధ్యం కాకపోతే ఉన్నట్లుగానే కనిపించాలి. అంత స్వచ్చంగా ఉన్నపుడే ఏదో ఒక రోజున కోరుకున్న శిఖరాలను  అధిరోహించ గలుగుతాము.
  51. నియమాల్ని పాటించకుండా ఏ పని జరుగదు. గతి నిర్దేశాల్లో ఏకాస్త తేడా వచ్చినా సౌరవ్యవస్థ మొత్తం కుప్ప కూలుతుంది కదా!!!
  52. ఆదర్శమంటూ లేని మనిషి తెడ్డులేని నావ లాంటివాడు.
  53. సొంత లోపాన్ని పట్టించుకోకుండా ఇతరులను ఎత్తి చూపడంలోనే మనం ఆనందం పొందుతాం. అందుకే ఇంత ఆశాంతి.
  54. పైకి కనిపించేదే అశుభ్రం కాదు.తెల్లటి వస్తువు మీద చిన్న మరక పడినా వెంటనే  గుర్తిస్తాం. నలుపు మీద చిన్న మరక పడినా వెంటనే గుర్తించం. నలుపు మీద ఎంత మాలిన్యం ఉన్నా కనిపించదు,పట్టించుకోము.
  55. 'నిజమైన బలం' అన్నది బలశాలి శారీరక శక్తిలో లేదు. కానీ అది మనశ్శక్తిలోనూ,ఆత్మజ్ఞానంలోనూ,మరణ భయం నుంచి విముక్తి పొందడంలోను ఉంటుంది.
  56. సుగుణం అనేది జీవితపు సౌందర్యం.
  57. సత్యం శాశ్వతమైనది, సత్యమే పలుకుట వలన మనిషి గౌరవం పెంచుతూ, మానవత్వ విలువలను కాపాడిన వారవుతాము.
  58. కష్టించి పని చేసేవానికే విశ్రాంతిలోని ఆనందం తెలుస్తుంది.
  59. మానవమాత్రునికి భగవంతుని గురించి పూర్తిగా వర్ణించడం  సాధ్యపడితే నా నిర్ణయం ప్రకారం భగవంతుడనగా సత్యం. కాని తర్వాత మరొక అడుగు ముందుకు వేసి  'సత్యమే భగవంతుడూ అని చెప్పగలను.
  60. మంచి  మనిషి ఆలోచన ఎప్పుడూ వృధా కాదు.
  61. సత్యం నా జీవితానికి ఊపిరి వంటిది.
  62. వెలుగు ఎక్కడ ఉంటుందో, నీడ కూడా అక్కడే ఉంటుంది.
  63. ప్రతి పౌరుడు హక్కులను మాత్రమే కోరుకుంటూ, బాధ్యతలను విస్మరిస్తే అరాజకం తప్పదు.
  64. జీవితం,మృత్యువు ఒకే నాణానికి రెండు ప్రక్కల వంటివి.
  65. మన దేశంలో ఏ రంగంలో ప్రగతి సాధించినా దాని ఫలితాలు అందరికీ సమానంగా దక్కాలి. అప్పుడే నేను ఆ ప్రగతిని గుర్తిస్తాను.
  66. మనం అభ్యుదయాన్ని సృష్టించాలంటే చరిత్రను పునరావృతం చేయడం కాదు. నూతన చరిత్రను సృష్టించగలగాలి.
  67. సత్కార్యాలు చేసి చూపెట్టు. చేస్తానంటూ ప్రచారం చేసుకుంటూ ఊరికే మురిసిపోకు.
  68. వెలుగుతున్న దీపం వెయ్యి దీపాలను వెలిగించినట్లే నేర్చుకున్నవాడే ఇతరులకి నేర్పించగలడు.
  69. ఏ విషయం గురించైనా సరే కేవలం తెలుసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కోరుకున్నది సాదించాలంటే నిరంతరం ప్రయత్నించాల్సిందే.
  70. ఆశ మానవుణ్ణీ గొప్పవాణ్ణి చేస్తుంది. దురాశ మానవుణ్ణి నీచుణ్ణి చేస్తుంది.
  71. విద్యను దాచుకోకు దానిని పది మందికీ పంచితే మరింత రాణిస్తుంది.
  72. గమ్యం లేని నావలాగా ఆదర్శం లేని శ్రమ నిరర్థకం.
  73. హింసాత్మక పోకడలతో సాధించిన విజయం ఓటమితో సమానం.
  74. ధైర్యగుణాన్ని మనిషి బాహ్య ప్రపంచంలో ఎక్కడా పొందలేడు. అది మనిషి స్వభావం లోంచే పుడుతుంది.
  75. సత్యం,అహింస లాంటి విలువైన పాఠాలు మనకి నేర్ప గలిగేది పసివారే.
  76. ఒక పువ్వు విచ్చుకోగానే ఎంత సువాసన వస్తుందో ఒక మంచి పుస్తకం తెరవగానే అంత విజ్ఞానం కనిపిస్తుంది.
  77. మనిషి తప్పు చేయడం సహజం, కాని చేసిన తప్పును తెలుసుకొనే  మానసిక పరిజ్ఞానం లేకపోవడమే తప్పు, తన తప్పును  సరిదిద్దుకొనేవాడే ఉత్తమ పౌరుడు.   
  78. కష్టాలను తప్పించుకొనే  వారికంటే వాటిని అధిగామించేవారే విజయం సాధించగలరు.   
  79. సత్యాన్ని మించినా అందం లేదు.
  80. అందం నడవడికలో వుంటుంది కాని ఆడంబరంలో కాదు.
      

7 comments:

  1. Quotations chala chala bagunnai thank Q!

    ReplyDelete
  2. please provide save as pdf link, Thank Q!

    ReplyDelete
  3. Ranjit YalamanchiliOctober 4, 2012 at 1:06 AM

    chaala thanks boss.. net lo chaala vethika ilanti quotes kosam.. aakariki mee blog lo dhorikay... a gr8 job..

    ReplyDelete
  4. Very true and good ones. Thanks for posting.

    ReplyDelete
  5. మహాత్మా గాంధీజీ సూక్తులను తెలుగు భాషలో అందరికీ అందుబాటులో తీసుకొచ్చిన మీ శ్రమ/కృషీ అభినందనీయం. ధన్యవాదాలు.

    ReplyDelete